PM Modi Egypt Visit: ఈ నెలలో ఈజిప్టు లో పర్యటించనున్న ప్రధాని మోడీ.. వ్యవసాయ ఎగుమతుల సహా వివిధ అంశాలపై ఒప్పందం..
ప్రధాని మోడీ చేపట్టిన ఈజిప్టు పర్యటన వ్యవసాయ రంగానికి అత్యంత ముఖ్యమైనదిగా తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మన దేశం భారీగా గోధుమలను ఎగుమతి చేస్తోంది. గోధుమల కొనుగోలుదారు దేశాల్లో ఈజిప్టు ప్రధాన దేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెలలో ఈజిప్ట్‌లో పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసితో చర్చలు జరపనున్నారు. ఈ భేటీలో ఇరు నేతల మధ్య పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. పరిశ్రమలు, ఉగ్రవాదం, రక్షణ వంటి అనేక అంశాలతో పాటు రెండు దేశాలు వ్యవసాయం పై కూడా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పదం దేశంలో వ్యవసాయ భవిష్యత్తును మార్చగలదని అంటున్నారు.
వాస్తవానికి ఈ ఏడాది జనవరిలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు.. ఈజిప్టు-భారత్ సంబంధాలను బలోపేతం చేసే విధంగా ఇరు దేశాల నేతల మధ్య ఒప్పందం కుదిరింది. అరబ్ దేశాల్లో బలమైన ఉనికిని భారత్ కోరుకుంటోంది. అదే సమయంలో సూయజ్ కెనాల్ చుట్టూ భారత్ భారీ పెట్టుబడులను పెట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మనదేశానికి ఈజిప్టు సహకారం అవసరం.
జూన్ 24-25 తేదీల్లో కైరోలో పర్యటించనున్న ప్రధాని మోడీ
ఈ నెల 24, 25 తేదీల్లో ప్రధాని మోడీ ఈజిప్ట్ రాజధాని కైరోలో పర్యటించనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటనలో ఉగ్రవాద నిరోధానికి ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవడంపై చర్చ జరుగుతుంది. రక్షణ పరిశ్రమ, భద్రత, ఇంధన రంగానికి సంబంధించి కూడా చర్చలు జరగనున్నాయి. ఏది ఏమైనా గత రెండేళ్లుగా ఇరు దేశాలు రక్షణ రంగంలో బలంగా పనిచేస్తున్నారు. భారత్, ఈజిప్టు కలిసి సైనిక విన్యాసాలు కూడా చేశాయి.
మారనున్న వ్యవసాయ రంగ పరిస్థితి..
ప్రధాని మోడీ చేపట్టిన ఈజిప్టు పర్యటన వ్యవసాయ రంగానికి అత్యంత ముఖ్యమైనదిగా తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మన దేశం భారీగా గోధుమలను ఎగుమతి చేస్తోంది. గోధుమల కొనుగోలుదారు దేశాల్లో ఈజిప్టు ప్రధాన దేశం. ఈ నేపథ్యంలో ఈజిప్టు పర్యటనలో ప్రధాని మోడీ, అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి ల మధ్య భారతీయ వ్యవసాయ వస్తువుల ఎగుమతి పెంపుపై ఒక ఒప్పందం కుదుర వచ్చని భావిస్తున్నారు.
అంతేకాదు భారతదేశం-ఈజిప్ట్ వ్యవసాయ ఒప్పందంపై సంతకం చేయవచ్చు. ఈ ఒప్పందంలో, వ్యవసాయ పద్ధతులను పంచుకోవడంపై గరిష్ట ప్రాధాన్యత ఉంటుంది. వ్యవసాయ రంగంలో అవలంబించాల్సిన ఉత్తమ కార్యకలాపాలను రెండు దేశాలు పంచుకోనున్నాయి. భారతదేశం, ఈజిప్ట్ రెండూ దీని ప్రయోజనాన్ని పొందుతాయి. వ్యవసాయాన్ని ఆధునీకరించేందుకు ఇది దోహదపడుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..