Mangoes: కిలో మామిడి పండ్లు.. ధర చూస్తే తిరుగుతాయి కళ్లు.. మీరు కొనగలరా ?
వేసవి వచ్చిందంటే మామిడి పండ్లు తినని వారే ఉండరు. చాలామంది ఇళ్లల్లో మామిడి చెట్లను పెంచుకుంటారు. మరికొందరైతే మామిడి తోటలనే సాగుచేస్తారు. ఆ తర్వాత పండించిన పండ్లను మార్కెట్‌లో అమ్మెస్తారు. సాధారణంగా మనం మామిడి పండ్లు కొనడానికి మార్కెట్‌కు వెళ్తే కిలో ధర రూ.50 నుంచి దాదాపు రూ. 400 వరకు ఉంటుంది.
వేసవి వచ్చిందంటే మామిడి పండ్లు తినని వారే ఉండరు. చాలామంది ఇళ్లల్లో మామిడి చెట్లను పెంచుకుంటారు. మరికొందరైతే మామిడి తోటలనే సాగుచేస్తారు. ఆ తర్వాత పండించిన పండ్లను మార్కెట్‌లో అమ్మెస్తారు. సాధారణంగా మనం మామిడి పండ్లు కొనడానికి మార్కెట్‌కు వెళ్తే కిలో ధర రూ.50 నుంచి దాదాపు రూ. 400 వరకు ఉంటుంది. అదే మామిడి పండ్ల ధర రూ.2.75 లక్షలు ఉంటే ? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా.. అయితే నిజంగానే అంత రేటుతో ఉన్న పండ్లు మన ఇండియాలో కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగుడి జిల్లా మటిగరా మాల్‌లో ప్రస్తుతం మామిడి పండ్ల ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఇక్కడికి దాదాపు 252 రకాల పండ్లను తీసుకొచ్చారు.
అయితే వాటిలో మియాజాకి అనే మామిడి చాలా స్పేషల్. దీన్ని చుసేందుకు చాలా మంది ఎగబడుతున్నారు. ఎందుకంటే వీటి ధరే కిలో రూ.2.75 లక్షలు. ఈ రకం మామిడి పండ్లు భారత్ సహా పలు ఆసియా దేశాల్లో కూడా పండిస్తున్నారు. మొదటగా జపాన్‌లోని మియాజాకి అనే నగరంలో.. ఈ రకం మామిటి చెట్లు బయటపడ్డాయి. పరిణామంలో కూడా ఇవి సాధారణ మామిడి పండ్ల కంటే పెద్దగా ఉంటాయి. ఒక్కో పండు బరువు సుమారు 350 గ్రాముల నుంచి 900 గ్రాముల వరకు పెరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇతర పండ్లతో పోలిస్తే కూడా ఈ రకం పండ్లలో తీపు 15 శాతం ఎక్కువగా ఉంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..