G-20 Tourism: గోవాలో నేటి నుంచి జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు
గోవాలో నేటి నుంచి జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరగనున్నాయి. ఈరోజు, రేపు 2 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే జూన్ 21, 22 తేదీల్లో జీ-20 టూరిజం మనిస్టర్స్ కాస్ఫరెన్స్ జరగనుంది. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే జీ-20 ప్రతినిధులు గోవాకి చేరుకున్నారు.

గోవాలో నేటి నుంచి జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరగనున్నాయి. ఈరోజు, రేపు 2 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే జూన్ 21, 22 తేదీల్లో జీ-20 టూరిజం మనిస్టర్స్ కాస్ఫరెన్స్ జరగనుంది. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే జీ-20 ప్రతినిధులు గోవాకి చేరుకున్నారు. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోంది. అయినప్పటికి ఈ రంగంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. దీంతో ప్రస్తుత పర్యాటక రంగంలో ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటి పరిష్కారాలు అనే అంశాలపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చ జరగనుంది. ఇప్పటివరకు జరిగిన జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాల ఫలితాలపై చర్చించి.. పరస్పర సహకారంపై వర్కింక్ గ్రూప్ ఉమ్మడి ప్రకటనను ఆమోదించనుంది.
గ్రీన్ టూరిజం, డిజిటలైజేషన్, నైపుణ్యాలు, పర్యాటక రంగంలో ఎంఎస్ఎంఈలు, టూరిజం డెస్టినేషన్ అనే ఐదు అంశాలపై ప్రధాన చర్చ జరగనుంది. 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో పర్యాటక రంగం ప్రాధాన్యతల గురించి కూడా చర్చించనున్నట్లు సమాచారం. ప్రారంభ సమావేశంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక మరియు షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యశో నాయక్ మరియు కేంద్ర పర్యాటక మరియు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్‌లు ప్రసంగించనున్నారు. ఈ సమావేశాల్లో భాగంగా ల్యాంప్ డాన్స్, కథక్, గోవా మాండో మ్యూజిక్ అండ్ డాన్స్, దేఖ్నీ డాన్స్, ముసల్ ఖేల్, గోమంత్ రంగ్ వంటి గోవా సాంస్కృతిక వారసత్వం చాటే సాంస్కృతిక కార్యక్రమాలు సైతం నిర్వహించనున్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




