Divorce Case: విడాకుల కోసం భర్తను బెదిరించి రూ. 6 కోట్ల భరణం డిమాండ్ చేసిన భార్య.. కేసు నమోదు
విడాకుల కోసం భర్త నుండి రూ. 6 కోట్ల భరణం డిమాండ్ చేసిన భార్యపై మధ్యప్రదేశ్ పోలీసులు బెదిరింపు కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం భార్యాభర్తల బంధాన్ని చిన్న చిన్న కారణాలతో విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. వైవాహిక బంధాన్ని ఈజీగా తెంపేసుకుంటున్నారు. అలా భార్యాభర్తలు కోర్టు మెట్లు ఎక్కారు.. ఈ డైవర్స్ కేసు కోర్టు పరిధిలో ఉండగానే.. భార్య ఒక అడుగు ముందుకేసి.. తన భర్త నుంచి విడాకులు కోరుతూ.. భరణంగా కోట్లు డిమాండ్ చేస్తూ బెదిరించింది. దీంతో భార్యపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
విడాకుల కోసం భర్త నుండి రూ. 6 కోట్ల భరణం డిమాండ్ చేసిన భార్యపై మధ్యప్రదేశ్ పోలీసులు బెదిరింపు కేసు నమోదు చేశారు. ఇద్దరి మధ్య విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. ఇంతలోనే భార్య భర్తను భరణం కోసం బెదిరించిందనే ఫిర్యాదు ఆధారంగా.. ఆ భార్యపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ ప్రకారం పలు కేసులు నమోదు చేశారు.
భన్వర్‌కువా పోలీస్ స్టేషన్‌కు చెందిన డిసిపి రాజేష్ సింగ్ మాట్లాడుతూ, “లలిత్‌పూర్‌లో నివసిస్తున్న రామ్ రాజ్‌పుత్ దంపతులు విడాకుల కోసం గతంలో కోర్టును ఆశ్రయించారు. అయితే ఇటీవల రామ్ రాజ్‌పుత్ భార్య ఆరు కోట్ల రూపాయలను భరణంగా డిమాండ్ చేస్తూ భర్తను బెదిరించింది. దీంతో రామ్ రాజ్‌పుత్ భన్వర్‌కువా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా భార్యపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 384, 507, 509 కింద కేసు నమోదు చేశారు.”
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..