Monkeys: ఆస్పత్రిలో కోతుల బీభత్సం.. సెలైన్ బాటిల్స్ ఎత్తుకెళ్లిన కోతులు.. వీడియో వైరల్..
అసలే ఎండాకాలం.. ఎండలు మండిపోతున్నాయి. ఇటు మనుషులు, అటు పశుపక్ష్యాదులు నీటికోసం అల్లాడుతున్న పరిస్థితులు. మరోవైపు అడవుల్లో నీళ్లు దొరక్క వన్యప్రాణులు గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. నానా బీభత్సం చేస్తున్నాయి. తాజాగా అల్లూరి జిల్లాలో కోతులు బీభత్సం సృష్టించాయి.
దేవీపట్నం మండలం ఇందుకూరుపేట ప్రభుత్వ ఆస్పత్రిపై వానరమూక దండెత్తింది. ఆస్పత్రిలోకి ప్రవేశించి నానా రచ్చ చేశాయి. అక్కడి సెలైన్ బాటిళ్లను ఎత్తుకెళ్లిపోయాయి. కోతులను తరిమేందుకు ప్రయత్నించిన ఆస్పత్రి సిబ్బందిపై కోతులు ఎదురుదాడికి యత్నించడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రతి రోజూ కోతులు ఆస్పత్రిలో నానా రచ్చ చేస్తున్నాయని, తరమబోతే దాడికి పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం అధికారులు స్పందించి కోతుల బెడదనుంచి ఆస్పత్రిని, సిబ్బందిని కాపాడాలని, తగిన చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

