Adipurush: పోలీసుల సంరక్షణలో ‘ఆదిపురుష్’ డైలాగ్ రైటర్‌.. ప్రాణహాని ఉందని ఆశ్రయించడంతో..

Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతీ సనన్ సీతారాములుగా తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ టీజర్ నుంచి సినిమా విడుదల వరకు వివాదాలతోనే సాగింది. జూన్ 16న విడుదలైన ఈ సినిమా డైలాగ్స్‌పై మరోసారి వివాదం చెలరేగింది. ముఖ్యంగా దేవదత్త నాగే..

Adipurush: పోలీసుల సంరక్షణలో ‘ఆదిపురుష్’ డైలాగ్ రైటర్‌.. ప్రాణహాని ఉందని ఆశ్రయించడంతో..
Adipurush Dialogue Writer Manoj Muntashir
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 19, 2023 | 5:41 PM

Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతీ సనన్ సీతారాములుగా తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ టీజర్ నుంచి సినిమా విడుదల వరకు వివాదాలతోనే సాగింది. జూన్ 16న విడుదలైన ఈ సినిమా డైలాగ్స్‌పై మరోసారి వివాదం చెలరేగింది. ముఖ్యంగా దేవదత్త నాగే పోషించిన హనుమంతుడి పాత్ర డైలాగులపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమా డైలాగ్ రైటర్ మనోజ్ ముంతషీర్ తనకు ప్రాణహాని ఉందంటూ ముంబై పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు స్పందించిన ముంబై పోలీసుల సదరు డైలాగ్ రైటర్‌కి భద్రత కల్పించడంతో పాటు పరిస్థితులను తాము పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

అయితే అంతకముందు సినిమా డైలాగ్‌లపై ముంతషీర్ మాట్లాడుతూ తాను రాసిన డైలాగుల్లో తప్పులేదని, అంతకముందు రామాయణంపై తెరకెక్కిన సినిమాలలో మాదిరిగానే డైలాగులు రాశానని, అయినా అందరి మనోభావాలను పరిగణనలోకి తీసుకుని జూన్ 18 నాటికి మూవీ డైలాగ్స్ మార్చాలని ఆదిపురుఫ్ టీమ్ నిర్ణయించిందని తెలిపాడు.

కాగా, ఆదిపురుష్ టీజర్ విడుదల నాటి నుంచి కూడా సినిమాను వివాదాలు వెంటాడుతున్నాయి. వీఎఫ్ఎక్స్ మాయలో పడి సినిమా కథను పాడు చేస్తున్నారని, ఇంకా రావణుడి ఆహార్యంపై, హనుమంతుడి డైలాగ్స్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు సినీ క్రిటిక్స్ ఇంకా అభిమానులు. ఈ నేపథ్యంలోనే సినిమాను బ్యాన్ కూడా చేయాలంటూ కొందరు బయలుదేరారు. ఈ కారణంగానే తనకు రక్షణ కల్పించాలని మనోజ్ ముంతషీర్ ముంబై పోలీసులను సంప్రదించారు.

ఇవి కూడా చదవండి

మరిన్నీ ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ  క్లిక్ చేయండి..

వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!