Health News: మందు బాబులారా జాగ్రత్త..! 40 శాతం పెరిగిన ఆ క్యాన్సర్ కేసులు.. మితిమీరితే తిసేయాల్సిందే..

మద్యం సేవించడం మన ఆరోగ్యానికి ఎంతో హానికరం చేస్తుంది. ఈ విషయం తెలిసినా కూడా కొందరు విపరీతంగా తాగుతుంటారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయం పాడైపోతుందని, లివర్ క్యాన్సర్ కూడా వస్తుందని తాజా నివేదికలు చెబుతున్నాయి. అవును, మద్యం కారణంగా లివర్ క్యాన్సర్, లివర్ ఫెయిల్యూర్ కేసులు..

Health News: మందు బాబులారా జాగ్రత్త..! 40 శాతం పెరిగిన ఆ క్యాన్సర్ కేసులు.. మితిమీరితే తిసేయాల్సిందే..
Cancer
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 18, 2023 | 7:41 AM

మద్యం సేవించడం మన ఆరోగ్యానికి ఎంతో హానికరం చేస్తుంది. ఈ విషయం తెలిసినా కూడా కొందరు విపరీతంగా తాగుతుంటారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయం పాడైపోతుందని, లివర్ క్యాన్సర్ కూడా వస్తుందని తాజా నివేదికలు చెబుతున్నాయి. అవును, మద్యం కారణంగా లివర్ క్యాన్సర్, లివర్ ఫెయిల్యూర్ కేసులు పెరుగుతున్నాయి. 2017 నాటికి 21 శాతం కేసులు ఉండగా, అది ఈ ఏడాదికి 40 శాతానికి పెరిగింది. మేదాంత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ వైద్య బృందం తెలిపిన వివరాల ప్రకారం లివర్ క్యాన్సర్ సమస్యకు ప్రధాన కారణంగా అల్కహాల్ మారుతోంది.

మెదాంత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అండ్ రీజెనరేటివ్ మెడిసిన్ చీఫ్ సర్జన్ డాక్టర్ అరవిందర్ సోయిన్ నేతృత్వంలోని బృందం 4,000 మంది కాలేయ మార్పిడి చేసిన వారి డేటా నుంచి ఈ సమాచారాన్ని సేకరించింది. వారిలో 78% మంది భారతదేశానికి చెందినవారు కాగా, మిగిలినవారు (22%) విదేశీయులు. ఈ రోగులందరూ కాలేయ మార్పిడి కోసం మేదాంతకు వచ్చివనవారే కాడవంతో అధ్యయనం త్వరిత కాలంలోనే పూర్తిచేయగలింది సదరు బృందం.

మద్యం సేవించడం వల్ల కాలేయ వైఫల్యం

ఆల్కహాల్ తాగడం వల్ల లివర్ ఫెయిల్యూర్ అవుతుందని డాక్టర్ అరవిందర్ తెలిపారు. ఈ కారణంగా మార్పిడి అవసరం వస్తుందన్నారు. వీరంతా(4000 మంది రోగులు) మద్యం సేవించే వారు. ఈ కారణంగానే వారి కాలేయం పనిచేయడం ఆగిపోయింది. రోగుల ప్రాణాలను కాపాడేందుకు కాలేయ మార్పిడి చేయించుకున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆల్కహాల్ మితంగా తీసుకోకపోవడం కారణంగానే లివర్ సమస్యలు పెరుగుతున్నాయని ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంకా చెడు ఆహారపు అలవాట్లు కూడా కాలేయ వ్యాధికి ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. గత కొన్నేళ్లుగా ఫ్యాటీ లివర్, లివర్ సిర్రోసిస్ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ఫ్యాటీ లివర్ తర్వాత ప్రజలు లివర్ సిర్రోసిస్ బారిన పడుతున్నారు. సకాలంలో చికిత్స చేయకపోతే, కాలేయం విఫలమవుతుంది. అటువంటి పరిస్థితిలో రోగి జీవితాన్ని కాపాడటానికి మార్పిడి తప్పనిసరిగా మారుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..