బీచ్‌లో స్టైల్‌గా వాకింగ్‌ చేస్తోన్న ఈ స్టార్‌ హీరోను గుర్తుపట్టారా? స్ర్కీన్‌పై పేరు కనిపిస్తే ఫ్యాన్స్‌లో పూనకమే

పై ఫొటోలో బీచ్‌లో సరదాగా వాకింగ్‌ చేస్తున్నది ఎవరో గుర్తుపట్టారా? ఇతను ఒక టాలీవుడ్‌ స్టార్‌ హీరో. మాస్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే అతని పేరు వింటే ఫ్యాన్స్‌లో పూనకం వస్తుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు తీస్తుంటారాయన.

బీచ్‌లో స్టైల్‌గా వాకింగ్‌ చేస్తోన్న ఈ స్టార్‌ హీరోను గుర్తుపట్టారా? స్ర్కీన్‌పై పేరు కనిపిస్తే ఫ్యాన్స్‌లో పూనకమే
Tollywood Hero
Follow us
Basha Shek

|

Updated on: Jun 19, 2023 | 5:54 PM

పై ఫొటోలో బీచ్‌లో సరదాగా వాకింగ్‌ చేస్తున్నది ఎవరో గుర్తుపట్టారా? ఇతను ఒక టాలీవుడ్‌ స్టార్‌ హీరో. మాస్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే అతని పేరు వింటే ఫ్యాన్స్‌లో పూనకం వస్తుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు తీస్తుంటారాయన. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఫ్యాన్స్‌ ఆయనను అమితంగా అభిమానించడానికి మరో కారణముంది. అదేంటంటే.. ఈ హీరోకు ఎలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌ లేదు.. సినిమా ఇండస్ట్రీలో గాడ్‌ ఫాదర్‌ కూడా లేడు. మెగాస్టార్‌ చిరంజీవి తర్వాత ఇండస్ట్రీలో స్వశక్తితో ఎదిగిన హీరో అతనే. మొదట హీరోల పక్కన చిన్న చితకా పాత్రలు పోషించాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌, విలన్‌ క్యారెక్టర్లు వేశాడు. ఒక డైనమిక్‌ డైరెక్టర్‌ అతనిలోని ట్యాలెంట్‌ను చూసి హీరోగా ఛాన్స్‌ ఇచ్చాడు. అంతే ఆ తర్వాత వెనక్కిచూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. హీరోగా బ్లాక్‌ బస్టర్‌ హిట్లు సొంతం చేసుకున్నాడు. మధ్యలో వరుసగా ప్లాఫులు ఎదురైనా తట్టుకుని నిలబడ్డాడు. మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చాడు. ఇటీవలే వరుసగా రెండు వంద కోట్ల సినిమాలు సొంతం చేసుకున్నాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో? యస్‌. అను మరెవరో కాదు మాస్‌ మహరాజా రవితేజ.

ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, ధమాకా వంటి రెండు బ్లాక్‌ బస్టర్‌ హిట్లు సొంతం చేసుకున్నాడు రవితేజ. ఆ తర్వాత రావణాసుర కొంచెం నిరాశపర్చినా మాస్‌ మహరాజా నటన అందరినీ ఆకట్టుకుంది. నెగెటివ్‌ రోల్‌లో రవితేజ యాక్టింగ్‌ నెక్ట్స్‌ లెవెల్‌ అన్న రీతిలో ఉంది. ఇక తర్వాతి సినిమాల విషయానికొస్తే.. త్వరలోనే టైగర్‌ నాగేశ్వరరావుగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు రవితేజ. స్టువర్టుపురం టైగర్‌ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో నుపుర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తోన్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 20న విడుదల కానుంది. అలాగే ఈగల్‌ అనే సినిమాలోనూ నటిస్తున్నాడు మాస్‌ మహరాజా.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by RAVI TEJA (@raviteja_2628)

View this post on Instagram

A post shared by RAVI TEJA (@raviteja_2628)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..