- Telugu News Photo Gallery Cinema photos Yash wife Radhika Pandit shares rare photos of Ayra and Yatharv to celebrate father's day
Father’s Day: ఫాదర్స్ డే స్పెషల్.. ఫ్యామిలీ ఫొటోస్ షేర్ చేసిన యశ్ సతీమణి
ఈ క్రమంలో ప్రముఖ నటి, కేజీఎఫ్ హీరో యశ్ సతీమణి రాధికా పండిట్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఫాదర్స్ డే సందర్భంగా ఆమె కొన్ని ప్రత్యేక ఫొటోలను పంచుకున్నారు. అవి కాస్తా వైరల్‌గా మారాయి.
Updated on: Jun 18, 2023 | 1:54 PM

ఇవాళ (జూన్ 18) ఫాదర్స్ డేని ఘనంగా జరుపుకుంటున్నారు. తండ్రితో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. సెలబ్రిటీలు కూడా ఈ వేడుకల్లో భాగమవుతున్నారు

ఈ క్రమంలో ప్రముఖ నటి, కేజీఎఫ్ హీరో యశ్ సతీమణి రాధికా పండిట్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఫాదర్స్ డే సందర్భంగా ఆమె కొన్ని ప్రత్యేక ఫొటోలను పంచుకున్నారు. అవి కాస్తా వైరల్‌గా మారాయి.

తన తండ్రితో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ 'నేను ఎప్పుడూ తండ్రి కూతురినే. ఏ కష్టమొచ్చినా ఆయన దగ్గరకు పరిగెత్తేది నేనే. ఆయనే నా మార్గదర్శి. అలాగే నా హీరో' అని ఈ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చింది.

అలాగే తన పిల్లలతో కలిసున్న ఫొటోలను షేర్ చేస్తూ 'ఇప్పుడు ఐరా, యథార్వ్ కూడా వారి తండ్రితో అదే బంధాన్ని కలిగి ఉన్నారు' అని తెలిపింది. అనంతరం 'ఫాదర్స్ డే' శుభాకాంక్షలు తెలిపింది.

ప్రస్తుతం యశ్ సతీమణి ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా కేజీఎఫ్ 2 తర్వాత చాలా కాలం పాటు గ్యాప్ తీసుకున్న యశ్ ఇటీవలే కొత్త ప్రాజెక్టుకు ఒకే చెప్పినట్లు తెలిసింది.





























