Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudhakar: చిరంజీవి తర్వాత పవన్‌ కల్యాణ్‌కు అన్నయ్య నేనే… ఏ కష్టమొచ్చినా స్పందిస్తారు: కమెడియన్‌ సుధాకర్‌

సినీ కళామతల్లికి సుమారు 45 ఏళ్ల పాటు సేవలందించిన సుధాకర్ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. వయసు పైబడడంతో పాటు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడమే దీనికి కారణం. ఇటీవల సుధాకర్‌ చనిపోయినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆయనే మీడియా ముందుకొచ్చి 'నేను బతికున్నాను' అని చెప్పుకోవాల్సి వచ్చింది.

Sudhakar: చిరంజీవి తర్వాత పవన్‌ కల్యాణ్‌కు అన్నయ్య నేనే... ఏ కష్టమొచ్చినా స్పందిస్తారు: కమెడియన్‌ సుధాకర్‌
Chiranjeevi, Comedian Sudhakar
Follow us
Basha Shek

|

Updated on: Jun 18, 2023 | 12:38 PM

సున్నితమైన హాస్యంతో తెలుగు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టారు కమెడియన్‌ సుధాకర్‌ . తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించారాయన. తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. చిరంజీవి, వెంకటేశ్‌, బాలకృష్ణ, నాగార్జున, రాజశేఖర్‌ వంటి సీనియర్‌ హీరోలతో పాటు పవన్‌ కల్యాణ్‌ లాంటి నెక్ట్స్‌ జనరేషన్‌ హీరోలతోనూ కలిసి నటించారు సుధాకర్‌. కేవలం నటుడిగానే కాదు నిర్మాతగానూ అభిరుచిని చాటుకున్నారు. సినీ కళామతల్లికి సుమారు 45 ఏళ్ల పాటు సేవలందించిన సుధాకర్ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. వయసు పైబడడంతో పాటు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడమే దీనికి కారణం. ఇటీవల సుధాకర్‌ చనిపోయినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆయనే మీడియా ముందుకొచ్చి ‘నేను బతికున్నాను’ అని చెప్పుకోవాల్సి వచ్చింది. కాగా గత కొన్నేళ్లుగాసినిమాలకు దూరంగా ఉన్న సుధాకర్‌ తాజాగా బుల్లితెరపై మెరిశారు. ఫాదర్స్‌డే సందర్భంగా ఓ టీవీ చానెల్‌ నిర్వహించిన స్పెషల్ ప్రోగ్రాంలో సందడి చేశారు. అలాగే ఓ ఇంటర్వ్యూకు కూడా హాజరయ్యారు. ఇందులో తన కుమారుడు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన సినిమా కెరీర్‌ గురించి, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా తన రూమ్‌ మేట్‌ మెగాస్టార్‌ చిరంజీవి గురించి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు.

‘తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాకు బాగా ఇష్టమైన కమెడియన్‌ ఎమ్మెస్‌ నారాయణ. ఆయన కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. ఇక బ్రహ్మానందం మా ఇంటికి దగ్గర్లోనే ఉండేవారు. అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వచ్చేవారు. చిరంజీవికి ఇప్పటికీ నేనంటే చాలా ఇష్టం. ఏ అవసరం వచ్చినా వెంటనే స్పందిస్తారు. ఇండస్ట్రీ కొత్తలో చిరంజీవి, నేను ఒకే గదిలో ఉండేవాళ్లం. అప్పుడు మొదలైన మా స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పటివరకు మా మధ్య చిన్న గొడవ కూడా రాలేదు. ఇక చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్‌తో కూడా నాకు మంచి అనుబంధం ఉంది. (పవన్‌, సుధాకర్‌ కలిసి సుస్వాగతం సినిమాలో నటించారు). చిరంజీవి తర్వాత పవన్‌ కు నేనే అన్నయ్య. త్వరలోనే నా కుమారుడు బిన్నీ సినిమాల్లోకి రానున్నాడు. చిరంజీవి దీవెనలు వాడికి ఉన్నాయి’ అని ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు సుధాకర్‌

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..