Adipurush Tickets: సీన్ రివర్స్‌.. ఆదిపురుష్‌కు బిగ్ షాక్‌.! పలు చోట్ల ఆగిపోయిన షోస్..

Adipurush Tickets: సీన్ రివర్స్‌.. ఆదిపురుష్‌కు బిగ్ షాక్‌.! పలు చోట్ల ఆగిపోయిన షోస్..

Anil kumar poka

|

Updated on: Jun 18, 2023 | 2:03 PM

హై ఎక్స్‌పెక్టేషన్స్‌ మధ్య... హై ఎండ్ గ్రాఫిక్ టెక్నాలిజీ మధ్య... ! రామాయణాన్ని కొత్తగా.. చూపిస్తున్నారనే టాక్‌ మధ్య..! అందులోనూ.. టీజర్ ట్రైలర్ కారణంగా చెలరేగిన వివాదాల మధ్య..! తాజాగా రిలీజ్ అయిన ఆదిపురుష్ మిక్స్‌డ్ టాక్ వచ్చేలా చేసుకుంది. టాక్తో సంబంధం లేకుండా... దిమ్మతిరిగే ఓపెనింగ్స్‌ను కూడా పట్టేసింది.

హై ఎక్స్‌పెక్టేషన్స్‌ మధ్య… హై ఎండ్ గ్రాఫిక్ టెక్నాలిజీ మధ్య… ! రామాయణాన్ని కొత్తగా.. చూపిస్తున్నారనే టాక్‌ మధ్య..! అందులోనూ.. టీజర్ ట్రైలర్ కారణంగా చెలరేగిన వివాదాల మధ్య..! తాజాగా రిలీజ్ అయిన ఆదిపురుష్ మిక్స్‌డ్ టాక్ వచ్చేలా చేసుకుంది. టాక్తో సంబంధం లేకుండా.. దిమ్మతిరిగే ఓపెనింగ్స్‌ను కూడా పట్టేసింది. కానీ డే 2 డే3 ఆ సీన్‌ ఉండదేమో అనే టాక్ వచ్చేలా చేసుకుంటుంది. ఎందుకంటే.. ఈ మూవీ టికెట్స్‌ అండ్ షోస్‌ భారీగా క్యాన్సిల్ అవుతున్నట్టు సోషల్ మీడియాలో ఓ న్యూస్‌ రన్ అవుతోంది. ఎస్ ! వాల్మీకి రామాయణాన్ని వక్రీకిరంచారనే ప్రభాస్ ఆదిపురుష్ సినిమా తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. ఈ సినిమా అనుకున్నంత రేంజ్లో లేదనే మౌత్ టాక్ విపరీతమవుతుండడంతో.. కొన్ని ఏరియాల్లో అందులోనూ.. నార్త్ లోని ఏరియాల్లో ఈ సినిమా షోలు క్యాన్సిల్ అవుతున్నాయట. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమాను చూసేందుకు భారీ రేట్‌ పెట్టి.. మల్టీప్లెక్స్‌లో బుక్ చేసుకున్న వారు కూడా… తమ నిర్ణయం మార్చుకుంటున్నారు. సినిమా టాక్‌ బయటికి రావడంతో.. చాలా మంది.. బుక్‌ మై షోలో అప్పటికే బుక్ చేసుకున్న టికెట్స్‌ ను క్యాన్సిల్ చేస్తున్నారట. క్యాన్సిల్ చేయడమే కాదు.. అలా క్యాన్సిల్ చేసిన స్క్రీన్ షార్ట్లను కొంత మంది సోషల్ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. వాటిని వైరల్ అయ్యేలా చేస్తున్నారు.