Rakesh Master: మా నాన్న మరణంపై అనుమానాలున్నాయి.. రాకేష్‌ మాస్టర్‌ కూతురు సంచలన వ్యాఖ్యలు

రాకేష్‌ మాస్టర్‌ మరణంపై  ఆయన కుటుంబ సభ్యులుఅనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మాస్టర్‌ కూతురు మాత్రం తన తండ్రి మృతికి అనారోగ్యం కాదని, వేరే కారణాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది

Rakesh Master: మా నాన్న మరణంపై  అనుమానాలున్నాయి.. రాకేష్‌ మాస్టర్‌ కూతురు సంచలన వ్యాఖ్యలు
Rakesh Master Daughter
Follow us
Basha Shek

|

Updated on: Jun 19, 2023 | 6:59 PM

ప్రముఖ కొరియాగ్రాఫర్‌ రాకేష్‌ మాస్టర్‌ తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. విశాఖలోని ఓ ఈవెంట్‌కు వెళ్లిన ఆయన రెండు రోజుల క్రితమే హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. అప్పటి నుంచే తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇక ఆదివారం (జూన్‌ 18) డ్యాన్స్‌ మాస్టర్‌ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది. రక్తపు విరేచనాలు, వాంతులతో తీవ్ర ఇబ్బంది పడడంతో ఆయనను సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే సాయంత్రం చికిత్స పొందతూ తుదిశ్వాస విడిచారు. కాగా హనుమాన్‌ సినిమా షూట్‌లోనే మాస్టర్‌కు రక్తపు వాంతులయ్యాయని, మల్టీ ఆర్గాన్స్‌ ఫెయిల్యూర్స్‌ కారణంగానే ఆయన చనిపోయారని ఆయన అసిస్టెంట్ వెల్లడించారు. అయితే రాకేష్‌ మాస్టర్‌ మరణంపై  ఆయన కుటుంబ సభ్యులుఅనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డ్యాన్స్ మాస్టర్‌ కూతురు మాత్రం తన తండ్రి మృతికి అనారోగ్యం కాదని, వేరే కారణాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘నా తండ్రి మృతిపై అనుమానం ఉంది. ఆయన చనిపోయారని తెలిసి షాక్‌కు గురయ్యాను. భయం వేసింది. అంతకు ముందు నాన్న ఫోన్‌ చేసి నాతో నార్మల్‌గానే మాట్లాడారు. విశాఖ పట్నం నుంచి వచ్చాను, కొంచెం అనారోగ్యంగా ఉంది. రెండు రోజుల్లో నిన్ను కలుస్తాను. అప్పుడు అన్నీ మాట్లాడుకుందాంలే అన్నారు.ఆ సమయంలో సుమారు 11 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడారు’

‘ నాన్న అనారోగ్యం వల్ల చనిపోలేదని, వేరే కారణాలు ఉన్నాయనిపిస్తోంది. చాలా నార్మల్‌గా ఉన్న వ్యక్తికి ఒక్కసారిగా అవయవాలన్నీ ఎందుకు దెబ్బతింటాయి? నాన్నకు షుగర్‌, ఎసిడిటీ ఉన్నాయని తెలుసు. కానీ ఒక్కసారిగా ఆర్గాన్స్‌ ఫెయిల్‌ అవ్వడమన్నది నమ్మశక్యంగా లేదు.నాన్న వారం లేదా ప్రతి 15 రోజుల కొకసారి ఆస్పత్రికి వెళ్తుంటారు. రెగ్యులర్‌గా చెకప్‌ చేయించుకుంటారు. ఒకవేళ అవయవాలు దెబ్బతినే ఛాన్స్ ఉంటే ఆ లక్షణాలు ముందుగానే తెలుస్తాయి కదా’ అని చెప్పుకొచ్చింది రాకేష్‌ మాస్టర్‌ కూతురు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు