AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush Collections: బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము రేపుతోన్న ‘ఆది పురుష్‌’.. 200 కోట్ల క్లబ్‌లోకి ప్రభాస్‌ సినిమా

ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము రేపుతోంది. సినిమాలోని వీఎఫ్‌ఎక్స్‌, ప్రభాస్‌ లుక్‌పై విమర్శలు, ట్రోలింగ్‌ వస్తున్నప్పటికీ వసూళ్లపై ఏ మాత్రం ప్రభావం చూపించడం. మొదటి రోజే రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఆదిపురుష్‌ రెండో రోజు కూడా భారీగానే కలెక్షన్లు రాబట్టింది.

Adipurush Collections: బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము రేపుతోన్న 'ఆది పురుష్‌'.. 200 కోట్ల క్లబ్‌లోకి ప్రభాస్‌ సినిమా
Adipurush Collections
Follow us
Basha Shek

|

Updated on: Jun 18, 2023 | 11:23 AM

ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము రేపుతోంది. సినిమాలోని వీఎఫ్‌ఎక్స్‌, ప్రభాస్‌ లుక్‌పై విమర్శలు, ట్రోలింగ్‌ వస్తున్నప్పటికీ వసూళ్లపై ఏ మాత్రం ప్రభావం చూపించడం. మొదటి రోజే రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఆదిపురుష్‌ రెండో రోజు కూడా భారీగానే కలెక్షన్లు రాబట్టింది. అయితే మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్లు కాస్త తగ్గాయని చెప్పుకోవచ్చు. శనివారం (జూన్‌ 17)న ఆదిపురుష్‌ సినిమా సుమారు రూ.60-80 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే వీకెండ్ కావడం, బరిలో మరే పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ఆదివారం నుంచి సినిమా కలెక్షన్లు పుంజుకునే అవకాశముందని తెలుస్తోంది. అయితే కలెక్షన్లు వస్తున్నా ఆదిపురుష్‌పై వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. కొన్ని హిందూ సంఘాలు సినిమాపై కోర్టు మెట్లెక్కాయి. ఇలా ఓ పక్క వివాదాలు, ట్రోలింగ్‌, విమర్శలతో ప్రభాస్‌ సినిమా ట్రెండింగ్‌లో ఉంది. ఇది కూడా కలెక్షన్లు పుంజుకోవడానికి ఒక కారణమని తెలుస్తోంది.

రామాయణం మహాకావ్యం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్‌ ఓం రౌత్‌ ఆదిపురుష్‌ సినిమాను తెరకెక్కించారు. ప్రభాస్‌ రాముడి అవతారంలో ఫ్యాన్స్‌కు ఫుల్‌ ట్రీట్‌ ఇచ్చారు. జానకిగా కృతి సనన్‌ అభినయం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక రావణాసురుడిగా సైఫ్ నటనకు ప్రశంసలు వస్తున్నాయి.ఇక లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవ్‌ దత్ నాగే పాత్రలకు కూడా మంచి పేరు వస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చిన్నారి ప్రాణం తీసిన పల్లిగింజ.. ఇంట్లో సరదాగా ఆడుకుంటూ...
చిన్నారి ప్రాణం తీసిన పల్లిగింజ.. ఇంట్లో సరదాగా ఆడుకుంటూ...
పండ్లు, కూరగాయలలో పురుగు మందులను గుర్తించడానికి పతంజలి పరిశోధన..
పండ్లు, కూరగాయలలో పురుగు మందులను గుర్తించడానికి పతంజలి పరిశోధన..
నల్ల వెల్లుల్లితో ఇన్ని లాభాలా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
నల్ల వెల్లుల్లితో ఇన్ని లాభాలా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
క్రికెట్ కోసం ఎంతో ఇష్టమైన ఆ రెండింటిని వదిలేసిన వైభవ్ సూర్యవంశీ
క్రికెట్ కోసం ఎంతో ఇష్టమైన ఆ రెండింటిని వదిలేసిన వైభవ్ సూర్యవంశీ
సీఐ కోసం జట్లు పట్టుకున్న ఇద్దరు మహిళలు.. చివరకు
సీఐ కోసం జట్లు పట్టుకున్న ఇద్దరు మహిళలు.. చివరకు
నెయ్యి కాఫీ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు తెలుసా?
నెయ్యి కాఫీ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు తెలుసా?
జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌.. రూ.895కే 336 రోజుల వ్యాలిడిటీ!
జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌.. రూ.895కే 336 రోజుల వ్యాలిడిటీ!
అడవిలో శవమై కనిపించిన ఫ్యామిలీ మ్యాన్ నటుడు.. అసలు ఏం జరిగిందంటే?
అడవిలో శవమై కనిపించిన ఫ్యామిలీ మ్యాన్ నటుడు.. అసలు ఏం జరిగిందంటే?
ఏం అందం మావ..! శ్రీలీలకు పోటీ అంటున్నారుగా..
ఏం అందం మావ..! శ్రీలీలకు పోటీ అంటున్నారుగా..
4 మిత్ర గ్రహాల యుతి.. ఆ రాశులకు నిత్య కల్యాణం పచ్చ తోరణం
4 మిత్ర గ్రహాల యుతి.. ఆ రాశులకు నిత్య కల్యాణం పచ్చ తోరణం