- Telugu News Photo Gallery Car Driving Tips: Do Not Ignore These Important Things While Driving at Mountains
Care Driving Tips: పర్వత ప్రాంతాల్లో కారు నడుపుతున్నారా? ఈ కీలక పాయింట్స్‌ని అస్సలు విస్మరించొద్దు..
Car Driving Tips: వేసవి సీజన్ వచ్చిందంటే చాలు.. విడిది కోసం చాలా మంది పర్వత ప్రాంతాలకు టూర్స్ వేస్తుంటారు. అయితే, పర్వత ప్రాంతాల్లో కారు డ్రైవింగ్ చేసే వారు కొన్ని కీలక విషయాలను విస్మరిస్తారు. అది వారికి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అలాకాకుండా కొన్ని విషయాలను జాగ్రత్తగా పాటిస్తే.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతుంది.
Updated on: Jun 23, 2023 | 2:14 PM

కారు బ్రేక్: అవసరం లేకపోయినా కారు బ్రేక్‌ను పదే పదే ఉపయోగించకూడదు. ఇలా చేస్తే కారు బ్రేక్ వేడెక్కుతుంది. దాని పనితీరును ప్రభావితం చేుస్తుంది. బ్రేక్‌కు బదులుగా ఇంజిన్ టెక్నాలజీని ఉపయోగించాలి.

ఉష్ణోగ్రత: పర్వాతలపై వాతావరణం ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో వాతావరణానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తెలుసుకుంటూ టూర్ ప్లాన్ చేసుకోవాలి. లేదంటే మార్గమధ్యలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉండొచ్చు, తుపాను మధ్యలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది.

స్పీడ్ కంట్రోల్: పర్వతాలపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కారు బ్యాలెన్స్‌ను నిర్వహించడం చాలా అవసరం. కారును నడుపుతున్నప్పుడు వేగాన్ని అదుపులో ఉంచుకోవాలి. అతివేగంతో వెళితే.. కారు నియంత్రణ కోల్పోవచ్చు. ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.

దూరం పాటించాలి: పర్వాతలపై మాత్రమే కాకుండా ఎక్కడైనా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ముందు, వెనుక వాహనాలకు దూరం పాటించాలి. అలా చేయకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దూరం పాటించడం ద్వారా సేఫ్‌గా డ్రైవింగ్ చేయొచ్చు.

రహదారి చిహ్నాలు: చాలా మంది ప్రజలు ప్రయాణ సమయంలో రహదారిపై ఉండే సంకేతాలను గుర్తించరు. కానీ, ఇలా ఎప్పుడూ చేయొద్దు. రహదారిపై సంకేతాలను, హెచ్చరికలను ఎల్లప్పుడూ చూస్తుండాలి. ఆ చిహ్నాలు, గుర్తుల ప్రకారమే వాహనాన్ని నడపాలి.





























