- Telugu News Photo Gallery Cricket photos IND vs WI: Jaydev Unadkat returned after 10 years in indian odi team Squad vs West Indies
IND vs WI: 10 ఏళ్ల తర్వాత వన్డే జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన లెఫ్టార్మ్ పేసర్.. ఈసారైన లక్ మారేనా?
Jaydev unadkat, IND vs WI: వెస్టిండీస్‌తో జరిగే భారత వన్డే జట్టుకు జయదేవ్ ఉనద్కత్ ఎంపికయ్యాడు. ఇప్పుడు మళ్లీ వన్డే జట్టులో అవకాశం లభించడంతో పదేళ్ల నిరీక్షణకు తెరపడుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
Updated on: Jun 24, 2023 | 12:34 AM

వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు జయదేవ్ ఉనద్కత్ ఎంపికయ్యాడు. స్వ్కాడ్‌లో అయితే, చోటు దక్కింది. దీంతో పదేళ్ల నిరీక్షణకు తెరపడుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అంటే ప్లేయింగ్ 11లో చోటు దక్కుతుందా లేదా అనేది చూడాలి.

వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును శుక్రవారం బీసీసీఐ ప్రకటించింది. సంజూ శాంసన్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్, ఉనద్కత్ కూడా వన్డే జట్టుకు ఎంపికయ్యారు. వీరితో పాటు ముఖేష్‌కుమార్‌కు కూడా అవకాశం కల్పించారు.

గత పదేళ్లుగా మళ్లీ నీలిరంగు జెర్సీ ధరించాలని కలలు కంటున్న ఉనద్కత్‌కు ఈ న్యూస్ చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఉనద్కత్ 10 ఏళ్ల క్రితం భారత్ తరపున చివరిగా వన్డే మ్యాచ్ ఆడాడు.

అంటే, 2013లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉనద్కత్ టీమిండియా తరపున ఆడాడు. అప్పటి నుంచి మళ్లీ వన్డే జట్టులో అవకాశం రాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు ఉనద్కత్‌ను వన్డే జట్టులో చేర్చారు. కానీ, ప్లేయింగ్ ఎలెవన్‌లో అతనికి అవకాశం రాలేదు.

దేశవాళీ క్రికెట్‌లో తన అద్భుత ప్రదర్శన కోసం ఉనద్కత్ పదేళ్ల నిరీక్షణకు తెరపడింది. వెస్టిండీస్‌లో అతని నిరీక్షణకు తెరపడుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ ఏడాది భారత్‌లో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ భారత్‌కు చాలా కీలకం కానుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సిరీస్ ప్రపంచకప్‌నకు చివరి దశ సన్నాహకానికి నాందిగా భావిస్తున్నారు.

అలాగే ఉనద్కత్‌కు ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కించుకోవడానికి మంచి అవకాశం ఉంది. భారత్ తరపున ఉనద్కత్ ఇప్పటి వరకు 7 వన్డేలు ఆడి 8 వికెట్లు పడగొట్టాడు.




