Viral: 2019లో ఆర్డర్ చేస్తే ఇప్పుడు డెలివరీ ఇచ్చారు.. షాక్‌లో టెకీ.. ఇంతకీ ఏం ఆర్డర్ చేశాడంటే..!
ఏదైనా వస్తువు కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే రెండు లేదా మూడు రోజుల్లో వస్తుంది. మరీ లేట్ అయితే ఒక వారం, రెండు వారాల తరువాతైనా వస్తుంది. కానీ, సంవత్సరాలు సంవత్సరాలు అయితే పట్టదు. ఇది అందరికీ తెలిసిందే. కానీ, ఇక్కడ పట్టింది.

ఏదైనా వస్తువు కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే రెండు లేదా మూడు రోజుల్లో వస్తుంది. మరీ లేట్ అయితే ఒక వారం, రెండు వారాల తరువాతైనా వస్తుంది. కానీ, సంవత్సరాలు సంవత్సరాలు అయితే పట్టదు. ఇది అందరికీ తెలిసిందే. కానీ, ఇక్కడ పట్టింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు సంవత్సరాలు పట్టింది ఒక వస్తువు డెలివరీ అవడానికి. అవును, ఈ ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన ఇంట్రస్టింగ్ వివరాలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీకి చెందిన టెక్కీ నితిన్ అగర్వాల్ నాలుగు సంవత్సరాల క్రితం AliExpress అప్లికేషన్‌లో ఆన్‌లైన్‌లో ఒక ప్రోడక్ట్‌ని ఆర్డర్ చేశాడు. సరిగ్గా నాలుగు సంవత్సరాల తరువాత ఇప్పుడు దానిని డెలివరీ చేశారు. ఈ విషయాన్ని కస్టమర్ నితిన్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తెలిపాడు.
2020లో 58 చైనీస్ యాప్‌లతో పాటు అలీ ఎక్స్‌ప్రెస్ యాప్‌ను కూడా భారత ప్రభుత్వం నిషేధించింది. అయితే, ఈ నిషేధానికి కొన్ని రోజుల ముందు అలీ ఎక్స్‌ప్రెస్ యాప్‌లో ఓ ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్‌ని ఆర్డర్ చేశాడు. భారతదేశంలో అందుబాటులో లేని కొన్ని ఎలక్ట్రానిక్స్ పరికరాలను చైనా నుంచి ఆర్డర్ చేసేందుకు అలీ ఎక్స్‌ప్రెస్ యాప్ వీలు కల్పిస్తుంది. ఈ క్రమంలోనే నితిన్ కూడా తనకు అవసరమైన ప్రోడక్ట్‌ను ఆర్డర్ చేశాడు. సరిగ్గా నాలుగేళ్ల తరువాత ఈ ఆర్డర్ డెలివరీ అవడం చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు నితిన్ అగర్వాల్.




ఇదే విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన నితిన్ అగర్వాల్.. ‘ప్రోడక్ట్ డెలివరీ విషయంలో ఎప్పుడూ ఆశను కోల్పోలేదు. నేను 2019లో అలీ ఎక్స్‌ప్రెస్ నుంచి ఆర్డర్ చేశాను. ఈ రోజు పార్శిల్ వచ్చింది.’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వ్యాపారం అంటేనే నమ్మకం.. ఆ నమ్మకాన్ని అలీ ఎక్స్‌ప్రెస్ నిలబెట్టుకుందని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..