Viral Video: జయమాల సమయంలో వధూవరులు స్వీట్ తినిపించుకునే సాంప్రదాయం.. వరుడు ఫోర్స్‌గా చేసిన పనికి వధువు షాకింగ్ రియాక్షన్..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో పెళ్లి వేదికపై వధూవరులు నిల్చుని ఉన్నారు. జయమాల కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బంధుమిత్రులంతా జరగబోయే కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఓ మహిళ ప్లేట్‌లో రసగుల్లా తీసుకొని వచ్చింది. జయమాల కార్యక్రమానికి ముందు వధూవరులు స్వీట్స్ తినిపించుకోవడం వారి సంప్రదాయం.

భారత దేశంలో పెళ్లంటే ఎన్నో సంప్రదాయాలతో కూడుకున్నది. అంతేకాదు పెళ్లిలో సరదా సన్నివేశాలకూ కొదవుండదు. వధూవరులను బంధువులు ఆటపట్టించడం ఒక ఎత్తయితే ఈమధ్య బంధుమిత్రులను తమ ఆటపాటలతో వధూవరులే అలరిస్తున్నారు. తాజాగా ఓ పెళ్లిలో జరిగిన ఇన్సిడెంట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పెళ్లివేదికపై జయమాల కార్యక్రమానికి ముందు వరుడుచేసిన పనికి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. అయితే వధువు మాత్రం తన రియాక్షన్‌తో వరుడికి చెమటలు పట్టించిందనుకోండి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో పెళ్లి వేదికపై వధూవరులు నిల్చుని ఉన్నారు. జయమాల కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బంధుమిత్రులంతా జరగబోయే కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఓ మహిళ ప్లేట్‌లో రసగుల్లా తీసుకొని వచ్చింది. జయమాల కార్యక్రమానికి ముందు వధూవరులు స్వీట్స్ తినిపించుకోవడం వారి సంప్రదాయం. దాంతో వధువు రసగుల్లా తీసుకొని వరుడికి తినిపించింది. వరుడు దానిని సగం తిని మిగతా సగం వధువుకు తినిపించబోయాడు. వధువు తినడానికి నిరాకరిస్తూ ఆ సగాన్ని ప్లేట్ పెట్టమని చెప్పింది. అయితే వరుడు మాత్రం తినాల్సిందే అన్నట్టుగా బలవంతంగా వధువు నోట్లో పెట్టేసాడు.




View this post on Instagram
అంతే వెంటనే నోట్లోని రసగుల్లా తీసేసి ఒక్కసారిగా సీరియస్ రియాక్షన్ ఇచ్చింది. దాంతో వరుడికి చెమటలు పట్టాయి. ఆ తర్వాత వధువు నోరు శుభ్రం చేసుకుంటుండగా వరుడు తన కర్చీఫ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను కోటిమందికిపైగా వీక్షించారు. లక్షలాదిమంది లైక్ చేశారు. అంతేకాదు తమదైనశైలిలో కామెంట్లు కురిపించారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..