AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fruit Tea: అరటి, సపోటాలతో టీ తయారు చేస్తున్న యువకుడు.. విషంగా మారుతుందని నెటిజన్లు మండిపాటు..

ఓ టీ దుకాణం దారుడు పండ్ల టీ తయారు చేశాడు. టీ తయారు చేస్తున్న ఓ యువకుడు గిన్నెలో అరటి పండు, చికు వంటి పండ్లను జోడించాడు. అంతేకాదు ఇప్పటివరకు ప్రపంచంలో ఇలాంటి టీ ఎవరూ తయారు చేయలేదని ఆ యువకుడు పేర్కొన్నాడు

Fruit Tea: అరటి, సపోటాలతో టీ తయారు చేస్తున్న యువకుడు.. విషంగా మారుతుందని నెటిజన్లు మండిపాటు..
Fruti Tea
Surya Kala
|

Updated on: Jun 20, 2023 | 12:09 PM

Share

ప్రస్తుతం నడుస్తోంది కలియుగం కాదు ప్రయోగాల యుగం అని సరదాగా కొందరు కామెంట్ చేస్తున్నారు.  ఆహారం, డ్రింక్స్ తయారీలో మాత్రమే కాదు.. విభిన్న విషయాల్లో వింత వింత ప్రయోగాలు చేస్తూ కనిపిస్తున్నారు. కొందరు మ్యాంగో పిజ్జా చేస్తే మరికొందరు మ్యాంగో ఆమ్లెట్ తయారు చేస్తున్నారు.. మరికొందరు ఐస్‌క్రీం పానీపూరీ అంటున్నారు.. ఇలా అది ఇది అని లేకుండా డ్రింక్స్, ఆహారం, స్నాక్స్ అన్నింటిపై ప్రయోగాలు చేస్తూ వింత వింత వంటకాలు తయారు చేస్తున్నారు. ఒకొక్కసారి ఈ వింత వంటలకు సంబంధించిన వీడియోలు చూసి షాక్ అవుతున్నారు. ఏమి ప్రయోగాలు బాబోయ్ అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు కూడా.. తాజాగా ఓ విచిత్రమైన ఆహార ప్రయోగం వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు షాక్ అవుతారు. ఈ వీడియో సోషల్ మీడియాలో భయాందోళనలు సృష్టిస్తోంది.

ఓ టీ దుకాణం దారుడు పండ్ల టీ తయారు చేశాడు. టీ తయారు చేస్తున్న ఓ యువకుడు గిన్నెలో అరటి పండు, చికు వంటి పండ్లను జోడించాడు. అంతేకాదు ఇప్పటివరకు ప్రపంచంలో ఇలాంటి టీ ఎవరూ తయారు చేయలేదని ఆ యువకుడు పేర్కొన్నాడు. అల్లం, మిరపకాయలు, తులసి లేదా ఇతర మసాలా దినుసులతో తయారు చేసే టీలను రుచి చూసి ఉంటారు. అయితే పండ్లతో టీ పెట్టడం బహు అరుదని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

టీ అమ్ముతున్న యువకుడు తనను తాను ‘ఐఏఎస్ చాయ్ వాలా’ అని పిలుచుకుంటున్నాడు.  చూడవచ్చు. తను చేస్తున్న ఫ్రూట్ టీలో భాగంగా తొక్క తీసిన అరటిపండును , చికులను వేశాడు. కొంత సేపు మరిగించి ఆ వింత టీని కస్టమర్స్ కు అందిస్తున్నాడు. ఈ వింత టీని కస్టమర్లు ఎలా తాగుతున్నారా మాకు తెలియదు.. కానీ ఇదేమి ఖర్మ మాకు అంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు.

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో seedhadillisevlog1 అనే ఐడితో షేర్ చేశారు. ఫన్నీ రియాక్షన్‌లతో హోరెత్తిస్తున్నారు.  ‘టీలో పండ్లు కలపకండి, విషం గా మారుతుంది ‘ అని కొందరంటే, ‘ఈ చేష్టల వల్లనే  మీరు ఐఏఎస్‌ కాలేకపోయారు’ అని మరికొందరు అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..