AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గ్రామాభివృద్ధికోసం వ్యక్తి వినూత్న నిరసన .. 22 కి.మీ. పరిగెత్తుకెళ్లి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్..

ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసే నాయకులే కానీ, వీరిని పట్టించుకునే నాధుడే లేడు. దాంతో అధికారులు, ప్రభుత్వాల తీరుకు విసిగిపోయిన ఓ వ్యక్తి వినూత్న నిరసనకు దిగాడు. తన గ్రామాన్ని తానే అభివృద్ధి చేసుకోవాలనుకున్నాడు. ఏకంగా 22 కిలో మీటర్లు పరుగెత్తికెళ్లి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్‌ వేసి ఎన్నికల బరిలో దిగాడు.

Viral Video: గ్రామాభివృద్ధికోసం వ్యక్తి వినూత్న నిరసన .. 22 కి.మీ. పరిగెత్తుకెళ్లి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్..
West Bengal Panchayat Elections
Surya Kala
|

Updated on: Jun 16, 2023 | 11:39 AM

Share

మనదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు దాటాయి.. అనేక అనేక మైలురాళ్లను అధిగమించింది అభివృద్ధి చెందిన దేశంగా పరుగులు పెడుతున్నాం.. ఆధునిక ఆవిష్కరణలతో ప్రపంచ యవనికలో మనకంటూ ఓ ప్లేస్ ను సొంతం చేసుకుంటున్నాం.. అయితే ఇప్పటి టెక్నాలజీ యుగంలోనూ మన దేశంలో ఎన్నో ప్రాంతాలు ఇంకా వెనుకబడే ఉన్నాయి. కనీసం సదుపాయాలు లేని అనేక గ్రామాలున్నాయి. అనేక గ్రామాల్లోని ప్రజలు  రవాణా సదుపాయాలు, విద్యుత్‌, తాగునీరు, వైద్య సదుపాయాలు లేకుండా నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా అటవీ పరిసర ప్రాంతాల్లో నివసించే గిరిజనులు ఏళ్లతరబడి అభివృద్ధికి నోచుకోక నానా అవస్థలు పడుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా వీరి తలరాతలు మాత్రం మారడంలేదు. ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసే నాయకులే కానీ, వీరిని పట్టించుకునే నాధుడే లేడు. దాంతో అధికారులు, ప్రభుత్వాల తీరుకు విసిగిపోయిన ఓ వ్యక్తి వినూత్న నిరసనకు దిగాడు. తన గ్రామాన్ని తానే అభివృద్ధి చేసుకోవాలనుకున్నాడు. ఏకంగా 22 కిలో మీటర్లు పరుగెత్తికెళ్లి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్‌ వేసి ఎన్నికల బరిలో దిగాడు. ఈ ఘటన బెంగాల్‌లోని ఓ గ్రామంలో వెలుగుచూసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

తన గ్రామంలో అభివృద్ధి లేక విసిగిపోయిన అతను దాదాపు 22 కిలీమీటర్ల దూరం పరిగెత్తికెళ్లి పంచాయతీ ఎన్నికల నామినేషన్ దాఖలు చేశాడు. బెంగాల్‌లోని దార్జీలింగ్ జిల్లా సొనాడ గ్రామంలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. కొండ ప్రాంతంలో ఉన్న తమ ఊరిని ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోవడం లేదని స్థానిక యువకుడు సనారా సుబ్బా ఆవేదన వ్యక్తం చేశాడు. ఏళ్లు గడుస్తున్నా తమ సమస్యలకు పరిష్కారం లభించకపోవడంతో తానే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..