Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బైక్‌పై పిండి మిల్లు.. సరి కొత్త ఆవిష్కరణకు ఐఏఎస్‌ ఆఫీసర్ ఫిదా.. నెట్టింట్లో వీడియో వైరల్

భిన్నమైన ఆలోచనలతో రకరకాల పనులతో భారతీయులమైన మనం ఎంత వినూత్నంగా ఆలోచించగలరో ప్రపంచానికి చూపిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం అటువంటి దేశీ జుగాడ్ వీడియో ఇంటర్నెట్‌లో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. ఈ వీడియో IAS అధికారిని కూడా ఆకట్టుకుంది.

Viral Video:  బైక్‌పై పిండి మిల్లు.. సరి కొత్త ఆవిష్కరణకు ఐఏఎస్‌ ఆఫీసర్ ఫిదా.. నెట్టింట్లో వీడియో వైరల్
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jun 11, 2023 | 1:30 PM

జుగాడ్ సృష్టించే విషయంలో భారతీయులకు సాటి ఇలలో లేరని చెప్పవచ్చు. ఎంత కష్టమైన పనినైనా ఏదొక  ఉపాయం జోడించి సులభతరం చేస్తారు. భిన్నమైన ఆలోచనలతో రకరకాల పనులతో భారతీయులమైన మనం ఎంత వినూత్నంగా ఆలోచించగలరో ప్రపంచానికి చూపిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం అటువంటి దేశీ జుగాడ్ వీడియో ఇంటర్నెట్‌లో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. ఈ వీడియో IAS అధికారిని కూడా ఆకట్టుకుంది.

ఈ వైరల్ క్లిప్ కొన్ని సెకన్లు మాత్రమే ఉంది. అయితే చూసిన ప్రతి ఒక్కరూ ఆ వ్యక్తి దేశీ జుగాడ్ కు సెల్యూట్ చేస్తున్నారు. వీడియోలో ఓ వ్యక్తి తను సృష్టించిన పిండి మిల్లుతో నిలబడి ఉన్నాడు. బైక్ పైన మెషిన్ ను  అమర్చుకున్నాడు. తరువాత ఆ యువకుడు పిండి మిల్లులో కొన్ని శనగగింజలను వేశాడు. కొన్నిసెకన్లలో పిండి వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇన్నోవేషన్ అంటే ఏమిటి 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ట్విట్టర్‌లో వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోను మా అమ్మ నాకు పంపింది. ఈ వ్యక్తి తన ప్రత్యేకమైన పిండి మిల్లు యంత్రంతో మా ఇంటికి వచ్చాడు. ఎంత అద్భుతమైన ఆవిష్కరణ. 15 సెకన్ల క్లిప్ 2.3 లక్షల కంటే ఎక్కువ వ్యూస్ ను భారీగా లైక్స్ ను సొంతం చేసుకుంది. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

ఎక్కువమందికి ఆ వ్యక్తి జుగాడ్ ఎంతగానో నచ్చింది. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు ఆ వ్యక్తి కష్టాన్ని చూసి చలించిపోయారు. అదే సమయంలో చాలా మంది ఈ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలని ఆసక్తిని చూపించారు. అయితే గ్రామంలో ఇలాంటి దృశ్యాలు మామూలే అని కూడా కొందరు అంటున్నారు. ఒక వ్యక్తి రోజూ మా గ్రామానికి వస్తాడు, అతను పప్పు సత్తును అమ్ముతుంటాడు. సార్ ఇలాంటి దృశ్యాలు మా బీహార్ గ్రామాల్లో చాలా సాధారణమని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..