Stunt Video: వ్యక్తి సైకిల్ హ్యాండిల్ మీద కాళ్లు పెట్టి స్టంట్స్.. చివరికి ఫన్నీగా ముగింపు..

నేటి కాలంలో ఎక్కడ చూసినా స్టంట్స్ క్రేజ్ కనిపిస్తోంది. నగరం, పల్లె, పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ విన్యాసాలు చేయడంలో నిమగ్నమై ఉంటున్నారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చేస్తున్న ఈ విన్యాసాలను చూస్తే ఇదంతా కేవలం లైక్‌లు, కామెంట్‌ల కోసమే అని అందరికీ తెలిసిందే. అంతేకాదు రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా పెరుగుతూనే ఉన్నాయి.

Stunt Video: వ్యక్తి సైకిల్ హ్యాండిల్ మీద కాళ్లు పెట్టి స్టంట్స్.. చివరికి ఫన్నీగా ముగింపు..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jun 12, 2023 | 10:53 AM

ప్రతిరోజు అనేక స్టంట్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీటిలో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే, మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. అదే సమయంలో విన్యాసాలు చేయడం పిల్లల ఆట కాదు.    స్టంట్‌ చేసే సమయంలో అనేక కష్టాలు పడాల్సి ఉంటుంది. ఈ సమయంలో చేసే ఫీట్స్  కొన్ని నవ్వుని కలిగిస్తాయి. అయితే కొన్ని స్టంట్‌మెన్‌లు కొన్ని విన్యాసాలు చేయగలరు. ఇవి ప్రజలను ఆకట్టుకుంటాయి.  కొంతమంది స్టంట్‌ చేసే సమయంలో ఏమీ ఆలోచించకుండా స్టంట్స్ చేస్తారు.. అప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే ఎవరికైనా నవ్వు ఆగదు. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో వైరల్ అవుతోంది.

నేటి కాలంలో ఎక్కడ చూసినా స్టంట్స్ క్రేజ్ కనిపిస్తోంది. నగరం, పల్లె, పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ విన్యాసాలు చేయడంలో నిమగ్నమై ఉంటున్నారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చేస్తున్న ఈ విన్యాసాలను చూస్తే ఇదంతా కేవలం లైక్‌లు, కామెంట్‌ల కోసమే అని అందరికీ తెలిసిందే. అంతేకాదు రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసు యంత్రాంగం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఒక వీడియో ద్వారా ప్రమాదాల గురించి తెలియజేయాలని ఒక వీడియో ని ప్రదర్శిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

వైరల్ అవుతున్న వీడియో ఓ గ్రామానికి చెందినదిగా తెలుస్తోంది. ఒక వ్యక్తి తన సైకిల్‌పై విన్యాసాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. సైకిల్ హ్యాండిల్‌ను పట్టుకోకుండా.. అతను తన పాదాలను సైకిల్ హ్యాండిల్ పై ఉంచి చేతులను పైకి లేపుతున్నాడు. ఈ సమయంలో సైకిల్  వేగం చాలా పెరిగి అదుపు తప్పింది. దీంతో ఆ వ్యక్తి రోడ్డు పక్కన పడిపోయాడు.

ఈ వీడియోను ఢిల్లీ పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 16 వేల మందికి పైగా లైక్ చేసిన ఈ వీడియో అనేక కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇలాంటి మూర్ఖత్వం ప్రయత్నం చేసే ముందు మీ కుటుంబం గురించి ఒక్కసారి ఆలోచించండి’ అని కామెంట్ చేయగా..  అదే సమయంలో, మరొకరు ‘నెక్స్ట్ టైం స్టంట్లు చేసే ముందు వందసార్లు ఆలోచిస్తారు’ అని అంటున్నారు. ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. ప్రజలకు అవగాహన పెంపొందించే ఇలాంటి ఫన్నీ పోస్ట్‌లను షేర్ చేస్తూ ఉంటారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..