Viral Video: రైలు వస్తుంటే ట్రాక్ మీద పడుకున్న యువకుడు.. లేడీ కానిస్టేబుల్ సాహసం వీడియో వైరల్..
వైరల్ అవుతున్న వీడియోలో ప్లాట్‌ఫారమ్‌పై ఒక వ్యక్తి ఒంటరిగా నిలబడి ఉన్నాడు. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అని అక్కడా ఇక్కడా చూస్తున్నాడు. రైలు వస్తున్న సమయం చూశాడు.. ట్రైన్ వస్తున్నట్లు అంచనా వేసి వెంటనే ఆ వ్యక్తి ట్రాక్ దగ్గరకు చేరుకున్నాడు.
నేటి యువతకు ప్రాణం విలువ జీవితం విలువ తెలియడం లేదు. చిన్న చిన్న విషయాలకే మనస్తాపానికి గురై తమ జీవితాలను ముగించుకునేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. నిజానికి జీవితం చాలా విలువైంది.. ప్రతి ఒక్కరికీ ఇబ్బందులు కష్టాలు వస్తాయి. వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి.. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని సక్సెస్ దిశగా అడుగులు వేయాలి. అయితే కొందరు జీవితంలో చిన్న కష్టం వచ్చినా సరే వాటి నుంచి పారిపోవడానికి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో నెటిజన్లను షాక్ కు గురి చేస్తోంది.. ఆలోచింపజేస్తోంది.
వైరల్ అవుతున్న వీడియోలో ప్లాట్‌ఫారమ్‌పై ఒక వ్యక్తి ఒంటరిగా నిలబడి ఉన్నాడు. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అని అక్కడా ఇక్కడా చూస్తున్నాడు. రైలు వస్తున్న సమయం చూశాడు.. ట్రైన్ వస్తున్నట్లు అంచనా వేసి వెంటనే ఆ వ్యక్తి ట్రాక్ దగ్గరకు చేరుకున్నాడు. ట్రాక్‌పై తల పెట్టుకుని పడుకున్నాడు. అదృష్టవశాత్తూ ఈ యువకుడు చేసిన పనిని ఒక లేడీ కానిస్టేబుల్ దృష్టిలో పడింది. వెంటనే ఆ కానిస్టేబుల్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ట్రాక్‌పైకి దూకి.. రైలు ఆ వ్యక్తిని చేరుకునే లోపు ట్రాక్ నుంచి బయటకు తీసుకుని వచ్చింది. అక్కడ ఉన్న మరికొందరు ఇదంతా చూసి.. వెంటనే స్పందించి.. ఆ యువకుడిని కాపాడుతున్న కానిస్టేబుల్‌కు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇదంతా వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తోంది.
#RPF Lady Constable K Sumathi fearlessly pulled a person off the track, moments before a speeding train passes by at Purwa Medinipur railway station.
Kudus to her commitment towards #passengersafety.#MissionJeevanRaksha #FearlessProtector pic.twitter.com/yEdrEb48Tg
— RPF INDIA (@RPF_INDIA) June 8, 2023
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆర్పీఎఫ్ ఇండియా ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఆ లేడీ కానిస్టేబుల్ పేరు సుమతి. పశ్చిమ బెంగాల్‌లోని ఈస్ట్ మేదినీపూర్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. అయితే ఆ వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడో ఇంకా తెలియలేదు. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు లేడీ కానిస్టేబుల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అమ్మకు సెల్యూట్ అని అంటే.. మరొకరు హమ్మయ్య ఒకరి ప్రాణం రక్షించారు.. ఈ సాహసం చాలా ప్రశంసనీయం అని అంటుంటే.. మరికొందరు పోలీసు కానిస్టేబుల్ నిజమైన దేవత అని అంటున్నారు. దీదీని ఎంత పొగిడినా తక్కువే అని మరో యూజర్ వ్యాఖ్యానించారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..