Viral: రాత్రివేళ ఇంట్లోకి సడెన్ ఎంట్రీ ఇచ్చి అనుకోని అతిథి.. లబోదిబోమన్న ఇంటి సభ్యులు..

ఇంట్లో అందరూ అటూ ఇటూ తిరుగుతూ సందడి చేస్తున్నారు. కొందరు టీవీ చూస్తుండగా.. మరికొందరు ఇంటి పనుల్లో బిజీగా ఉన్నారు. సరిగ్గా రాత్రి 10 గంటల సమయంలో సడెన్ ఎంట్రీ ఇచ్చింది అనుకోని అథితి. కాసేపటి వరకు దానిని ఎవరూ గమనించలేదు. ఇక ప్లేస్ బాగుందని అనుకుందో ఏమో గానీ..

Viral: రాత్రివేళ ఇంట్లోకి సడెన్ ఎంట్రీ ఇచ్చి అనుకోని అతిథి.. లబోదిబోమన్న ఇంటి సభ్యులు..
Snake
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 12, 2023 | 10:07 AM

ఇంట్లో అందరూ అటూ ఇటూ తిరుగుతూ సందడి చేస్తున్నారు. కొందరు టీవీ చూస్తుండగా.. మరికొందరు ఇంటి పనుల్లో బిజీగా ఉన్నారు. సరిగ్గా రాత్రి 10 గంటల సమయంలో సడెన్ ఎంట్రీ ఇచ్చింది అనుకోని అథితి. కాసేపటి వరకు దానిని ఎవరూ గమనించలేదు. ఇక ప్లేస్ బాగుందని అనుకుందో ఏమో గానీ.. ఏకంగా హాల్‌లోనే నిద్రపోయింది. అయితే హాయిగా నిద్రపోతున్న కొండ చిలువ బుస్ అంటూ పెద్దగా శబ్ధాలు చేసింది. అప్పుడు ఇంట్లో వాళ్లు దానిని గుర్తించారు. ఆ శబ్ధాన్ని విని ఏదో వచ్చిందని అటూ ఇటూ చూశారు. ఇంకేముందు.. కళ్ల ముందు భారీ కొండ చిలువు దర్శనమిచ్చింది. దెబ్బకు అందరి గుండెలు జారిపోయాయ్. బాబోయ్ పాము అంటూ ఇళ్లంతా కేకలతో మోత మోగిపోయింది.

క్వీన్స్‌లాండ్‌లోని ఓ ఇంట్లోకి 8 అడుగుల కొండ చిలువ దూరింది. ఈ పామును ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇంటి సభ్యులు. రాత్రి 10 గంటల సమయంలో 2.5 మీటర్ల పొడవైన కొండ చిలువ తమ ఇంట్లోకి వచ్చిందని, కిచెన్‌ రూమ్‌ పైకప్పు నుంచి ఇది ఇంట్లోకి వచ్చి ఉంటుందని పేర్కొన్నారు. హాల్‌లోకి ప్రవేశించిన పాము.. హాయిగా పడుకుంది. కదిలించినా కదల్లేదని ఇంటి యజమాని జెరెమీ పేర్కొన్నారు.

అయితే, పాము విషయాన్ని స్నేక్ క్యాచర్‌కు తెలుపగా.. వారు వచ్చి ఆ కొండ చిలువను సేఫ్‌గా పట్టుకుని ఒక కవర్‌లో వేశారు. అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో వదిలేశారు. అయితే, ఈ జాతి పాము చాలా వరకు ప్రశాంతంగా ఉంటుందని, మనుషులకు చాలా అరుదుగా ముప్పు కలిగిస్తుందని పేర్కొన్నారు. కాగా, ఈ పాము ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అవుతోంది. దీనికి నెటిజన్లు ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు. ‘ఇప్పుడి ఆ ఇల్లు కొండచిలువది’ అంటూ కామెంట్ పెట్టారు ఓ నెటిజన్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..