Kitchen Hacks: ఈ 10 ఆహారాలను పొరపాటున కూడా ఫ్రిజ్‌లో పెట్టొద్దు.. వివరాలే..
వేసవి కాలంలో ఆహారాలు, కూరగాయలు చాలా త్వరగా పాడైపోతాయి. అవి పాడవకుండా ఉండేందుకు చాలా మంది వాటిని ఫ్రిజ్‌లో పెడతారు. అయితే, కొన్ని పదార్థాలు, కూరగాయలను ఫ్రిజ్‌లో పెట్టకూడదని తెలుసా? అవి ఫ్రిజ్‌లో పెట్టి, ఆ తరువాత తినడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
వేసవి కాలంలో ఆహారాలు, కూరగాయలు చాలా త్వరగా పాడైపోతాయి. అవి పాడవకుండా ఉండేందుకు చాలా మంది వాటిని ఫ్రిజ్‌లో పెడతారు. అయితే, కొన్ని పదార్థాలు, కూరగాయలను ఫ్రిజ్‌లో పెట్టకూడదని తెలుసా? అవి ఫ్రిజ్‌లో పెట్టి, ఆ తరువాత తినడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడని 10 పదార్థాలేంటో ఇవాళ మనం తెలుసుకుందాం..
చపాతీ, రొట్టెలు, బ్రెడ్..
బ్రెడ్, రొట్టెలు, చపాతీలు ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు. ప్రిజ్‌లో వాటిని నిల్వ చేయడం వల్ల అది త్వరగా పాడైపోతుంది. గట్టిగా అవుతాయి.
టొమాటో..
టొమాటోలను అన్ని రకాల వంటలలో ఉపయోగిస్తారు. అయితే వాటిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల రుచి, ఆకృతి రెండూ పాడైపోతాయి.
తేనె..
తేనెను ఉపయోగించిన తర్వాత రిఫ్రిజిరేటర్‌లో పెట్టకూడదు. ఎందుకంటే అది ఘనీభవిస్తుంది. దానిలో స్ఫటికాలు ఏర్పడతాయి.
పుచ్చకాయ..
పుచ్చకాయ తినేందుకు ఇష్టపడని వారు ఉండరు. అయితే, పుచ్చకాయను ఎప్పుడూ ఫ్రిజ్‌లో పెట్టకూడదు. దీన్ని ఫ్రిజ్‌లో ఉంచడం వలన అందులోని యాంటీఆక్సిడెంట్లు నశిస్తాయి. అంతేకాదు, రంగు, రుచి కూడా మారుతుంది.
బంగాళదుంప..
బంగాళదుంపలను పొరపాటున కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. బంగాళదుంపలలో స్టార్చ్ ఉంటుంది. వాటిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల చక్కెర పరిమాణం పెరుగుతుంది.
ఉల్లిపాయ..
ఉల్లిపాయను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల తేమ చాలా త్వరగా గ్రహించి చెడిపోతాయి.
వెల్లుల్లి..
వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అది మొలకెత్తుతుంది. దాని రుచి కూడా మారుతుంది. అందుకే వెల్లుల్లిని ఎప్పుడూ ఫ్రిజ్‌లో ఉంచకూడదు.
అరటిపండు..
అరటిపండును ఫ్రిజ్‌లో ఎప్పుడూ ఉంచకూడదు. ఎందుకంటే దాని రంగు, ఆకృతి, రుచి త్వరగా చెడిపోతుంది. అరటిపండు బయటి నుండి నల్లగా మారుతుంది.
కాఫీ..
కాఫీని కూడా ఫ్రిజ్‌లో ఉంచకూడదు. అది ఫ్రిజ్‌లోని తేమను గ్రహించి గట్టిపడుతుంది. కాఫీ రుచి కూడా క్షీణిస్తుంది.
ఆలివ్ నూనె..
ఆలివ్ నూనెను ఫ్రిజ్‌లో పెట్టొద్దు. అది గట్టిపడుతుంది. దానిలో స్ఫటికాలు ఏర్పడతాయి.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..