Pradosh Vratam 2023: ఈ నెల 15న ప్రదోష వ్రతం.. ఇంట్లో శాంతి సంతోషాల కోసం శివయ్యను ఈ విధంగా పూజించండి..

ప్రదోష కాలాన్ని శివుడిని ఆరాధించడానికి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ప్రదోష వ్రతం రోజున  తెల్లవారుజామున నిద్రలేచి అభ్యంగ స్నానం చేయాలి. అనంతరం ఉపవాస దీక్షను చేపట్టాలి. రోజంతా శివుడి నామ జపం చేయాలి. సాయంత్రం మళ్ళీ స్నానం చేసి.. అనంతరం ప్రదోషకాలంలో శివపూజ ప్రారంభించాలి. 

Pradosh Vratam 2023: ఈ నెల 15న ప్రదోష వ్రతం..  ఇంట్లో శాంతి సంతోషాల కోసం శివయ్యను ఈ విధంగా పూజించండి..
Pradosh Vratam 2023
Follow us
Surya Kala

|

Updated on: Jun 12, 2023 | 9:57 AM

హిందూ మతంలో దైవారాధనకు విశిష్ట స్థానం ఉంది. భక్తులు తనను జలంతో అభిషేకం చేసినా సరే శివయ్య అనుగ్రహం కురిపిస్తాడు. నిజానికి మత గ్రంథాలలో ప్రదోష వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. జూన్ నెల రెండవ ప్రదోష వ్రతం 15వ తేదీన ఆచరించనున్నారు. ఈ రోజున మహాదేవుడిని పూజించడం ద్వారా భక్తులు కోరుకున్న ఫలితాలను ఇస్తాడని విశ్వాసం. భక్తులందరూ ఈ రోజున శివయ్యను పూజిస్తారు. ఇలా పూజ చేసిన భక్తుల పట్ల పరమశివుడు ప్రసన్నుడై అతని కష్టాలన్నీ తొలగిపోయేలా అనుగ్రహిస్తాడని విశ్వాసం. ప్రదోష వ్రతం సమయంలో శివుడిని పూజిస్తారు. శివుడిని ఆరాధిస్తే.. ఇంట్లో సంతోషం, శాంతి వాతావరణం నెలకొంటుందని నమ్ముతారు.

ప్రదోష వ్రతంలో మహాదేవుడిని ఎలా పూజించాలంటే.. 

ప్రదోష కాలాన్ని శివుడిని ఆరాధించడానికి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ప్రదోష వ్రతం రోజున  తెల్లవారుజామున నిద్రలేచి అభ్యంగ స్నానం చేయాలి. అనంతరం ఉపవాస దీక్షను చేపట్టాలి. రోజంతా శివుడి నామ జపం చేయాలి. సాయంత్రం మళ్ళీ స్నానం చేసి.. అనంతరం ప్రదోషకాలంలో శివపూజ ప్రారంభించాలి.

ఇవి కూడా చదవండి

పూజానంతరం, పంచామృతం , నీటితో శివునికి స్నానమాచరించి ఆపై దీపం వెలిగించి పూజను ప్రారంభించండి. పూజ సమయంలో బిల్వ పత్రాలు, ఉమ్మెత్త పువ్వులు, రుద్రాక్ష, గంగా జలాన్ని సమర్పించాలి. ఇలా పూజ చేయడం వలన శివుడు సంతోషించి భక్తులను అనుగ్రహిస్తాడని నమ్మకం.

ఉపవాస సమయంలో చేయకూడని తప్పులు 

ప్రదోష వ్రతం రోజున ముందుగా పూజగదిని శుభ్రం చేయాలి. అంతేకాదు సూర్యోదయం నుంచి ఉపవాస దీక్షను చేపట్టాలి. ముఖ్యంగా మాంసం-మద్యం మొదలైన వాటికి దూరంగా ఉండాలి. అంతే కాకుండా ఇంట్లో ఎటువంటి వివాదాలు లేకుండా ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాలి. సాయంత్రం పూజ అనంతరం జాగరణ చేయాలి. అయితే ఈ ప్రదోష వ్రతం రోజున తెలియకుండా కూడా నల్లని దుస్తులు ధరించవద్దు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).