Vastu Tips: వారంలో ఈ 2 రోజులు ధూపం వేయకండి..! ఎందుకో తెలుసా.. కారణం ఏంటంటే..

. ధూపం వేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని పాటించకపోతే భయంకరమైన పరిణామాలకు దారి తీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతిరోజూ ధూపం వేయడం వల్ల సానుకూల శక్తిని పెంచుకోవచ్చు. అయితే వారానికి రెండురోజులు ధూపం వేయడం నిషేధించబడింది.

Vastu Tips: వారంలో ఈ 2 రోజులు ధూపం వేయకండి..! ఎందుకో తెలుసా.. కారణం ఏంటంటే..
Agarbatti
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 12, 2023 | 8:13 AM

పూజ పునస్కారాలకు మన జీవితంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఇంట్లో దేవుడికి నిత్య పూజలు జరుగుతాయి. అయితే, పూజకు సంబంధించి కొన్ని వాస్తు నియమాలు కూడా ఉన్నాయి. ఈ నియమాలు పాటిస్తే ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు నెలకొంటాయిని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.. నిత్యం పూజలు చేసినా ఆశించిన ఫలితాలు రాని వారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే పూజ పునస్కార సమయంలో అనుకోకుండా, తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అటువంటి పొరపాటు అగర్బత్తికి సంబంధించినది కూడా ఒకటి ఉంది. ధూపం వేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని పాటించకపోతే భయంకరమైన పరిణామాలకు దారి తీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతిరోజూ ధూపం వేయడం వల్ల సానుకూల శక్తిని పెంచుకోవచ్చు. అయితే వారానికి రెండురోజులు ధూపం వేయడం నిషేధించబడింది.

చాలామందికి ఈ పూజా నియమం గురించి తెలియదు. ఎందుకంటే వారు తెలియక తప్పులు చేస్తారు. అలాంటి వారు తమ జీవితాంతం దాని ఫలితాన్ని అనుభవిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం వారంలో రెండు రోజులు అంటే ఆదివారం, మంగళవారం ఇంట్లో దీపాలు పెట్టకూడదు. ఈ రెండు రోజులు ఇంట్లో అగరబత్తిని కూడా వెలిగిస్తే ఆ వ్యక్తికి దుఃఖం కలుగుతుందని చెబుతున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఈ రెండు రోజులు వెదురును కాల్చడానికి అశుభమైనవిగా భావిస్తారు. అగరుబత్తీలోని కర్ర వెదురుతో చేసినందున, అగరబత్తిని కాల్చడం నిషేధించబడింది. కాబట్టి మంగళవారం లేదా ఆదివారం మీ ఇంట్లో ధూపం వెలిగిస్తే ఆర్థిక, మానసిక సమస్యలు ఎదురవుతాయి.

ఇవి కూడా చదవండి

ఇంట్లో వత్తికి బదులు కర్పూరం, దీపం పెట్టవచ్చని శాస్త్రాలలో కూడా చెప్పబడింది. ఇది కుటుంబంలో ఆనందం, శాంతిని పెంచుతుంది. అగరబత్తులు వెదురుతో తయారు చేస్తారు. మతపరమైన కార్యక్రమాలలో వెదురును కాల్చడం దురదృష్టాన్ని పెంచుతుంది. కాబట్టి మీరు లక్ష్మి అనుగ్రహం పొంది ఇంట్లో సుఖశాంతులు, శాంతిని పెంపొందించుకోవాలంటే అగరబత్తులు వాడకపోవటం మంచిదని చెబుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).