Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Viral: వేసవి తాపానికి సృహ కోల్పోయిన పిచ్చుక.. చుక్క నీరే అమృతంగా మారి ప్రాణాన్ని నిలబెట్టిందిగా

వేసవిలో పశు పక్ష్యాదులు దాహార్తిని తీర్చడం కోసం ప్రత్యేక నీటి వసతిని కల్పించామంటూ మానవత్వం ఉన్న వారు భారీగా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఎండ వేడికి దాహంతో అల్లాడుతున్న ఓ పక్షికి ప్రాణం పోసాడు ఓ యువకుడు.. దాహంతో ఉన్న పిచ్చుకకు ఓ వ్యక్తి మళ్లీ ప్రాణం పోసిన ఈ వీడియో పలువురిని ఆకట్టుకుంటుంది. 

Video Viral: వేసవి తాపానికి సృహ కోల్పోయిన పిచ్చుక.. చుక్క నీరే అమృతంగా మారి ప్రాణాన్ని నిలబెట్టిందిగా
Bird Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Jun 13, 2023 | 1:44 PM

వేసవిలో దాహం తీర్చడం అత్యంత పుణ్యప్రదం అని పురాణాలు పేర్కొన్నాయి. చాలామంది వేసవి తాపం తీర్చడానికి రోడ్డుకి ఇరువైపులా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తారు. అయితే కొందరు తమ చుట్టుపక్కల ఎటువంటి పరిస్థితులున్నా.. ప్రాణాపాయంలో ఉన్నా తమకేమి పట్టనట్లు పోతూ ఉంటారు. అదే సమయంలో మరికొందరు మానవత్వంతో స్పందిస్తారు. ఇంకా ఇలాంటి మానవత్వం ఉన్న మనుషులున్నారు కనుకనే కలియుగంలో  ఈ మాత్రం నడుస్తోంది అన్న మాటలు కూడా తరచుగా వింటూ ఉంటాం. అలాంటి మానవత్వానికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఈ ఏడాది ఎండ వేడి గత రికార్డులన్నింటినీ బద్దలు కొడుతోంది. ఎక్కడ చూసినా వేసవి తాపానికి జనంనానా  అవస్థలు పడుతున్నారు. మనిషి అయినా, జంతువు అయినా తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే మనుషులు వేసవి తాపం తీర్చుకోవడానికి… దాహార్తిని తీర్చుకోవడానికి రకరకాల మార్గాలను ఎంచుకుంటారు. అయితే వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి జంతువులకు, పక్షులకు అసాధ్యంగా మారుతుంది ఒకొక్కసారి. దాహం వలన పక్షులు చనిపోవడం చాలాసార్లు చూస్తూనే ఉన్నాం. అటువంటి పరిస్థితిలో వేసవిలో పశు పక్ష్యాదులు దాహార్తిని తీర్చడం కోసం ప్రత్యేక నీటి వసతిని కల్పించామంటూ మానవత్వం ఉన్న వారు భారీగా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఎండ వేడికి దాహంతో అల్లాడుతున్న ఓ పక్షికి ప్రాణం పోసాడు ఓ యువకుడు.. దాహంతో ఉన్న పిచ్చుకకు ఓ వ్యక్తి మళ్లీ ప్రాణం పోసిన ఈ వీడియో పలువురిని ఆకట్టుకుంటుంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఎండ వేడికి స్పృహ కోల్పోయి ఒక పక్షి నేలపై పడిపోయింది. చూసిన ఎవరికైనా ఇంక బతకడం కష్టం అనిపించక మానదు ఎవరికైనా.. అటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి నీటి సీసాని తీసి పిచ్చుకపై చిలకరించాడు. అనంతరం ఆ నీటిని పిచ్చుకకి తాగేటట్లు చేశాడు. కొన్ని నీటి చుక్కలు ఆ పిచ్చుక్కి అమృతంలా పనిచేసినట్లుంది. వెంటనే ఆ పిచ్చుక నిద్రలో లేచినట్లు సృహ నుంచి మేల్కొంది. ఓ  వ్యక్తి మానవత్వానికి ఉదాహరణగా నిలిచి పిచ్చుక ప్రాణాన్ని కాపాడాడు.

ఈ వీడియో @Lap_surgeon అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయబడింది. లక్షలాది వ్యూస్, భారీ లైక్స్ ను సొంతం చేసుకుంది. జంతువులు, పక్షుల పట్ల దయను చూసి చాలా సంతోషించారు. అందరూ చాలా మెచ్చుకున్నారు. ఆపదలో హఠాత్తుగా వచ్చి సహాయం చేసే వారు దైవంతో సమానం అని  చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..