Viral Video: మంచాన్ని నాలుగు చక్రాల వాహనంగా మార్చిన యువకుడు.. చిలిపి జుగాడ్‌ అంటున్న ఆనంద్ మహీంద్రా

ఆ యువకుడు లాంగ్ డ్రైవర్‌పై వెళ్దాం అని చెప్పాడు. తన స్నేహితుడిని మంచం మీద కూర్చోబెట్టి అల్లరి చేశాడు. వీడియోను షేర్ చేసి.. ఇది అద్భుతమైన ఆవిష్కరణగా పేర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ జుగాడ్ గ్రామ ప్రజలకు ఒక వరం వంటిది అని చెబుతున్నాడు ఆ యువకుడు.

Viral Video: మంచాన్ని నాలుగు చక్రాల వాహనంగా మార్చిన యువకుడు.. చిలిపి జుగాడ్‌ అంటున్న ఆనంద్ మహీంద్రా
Jugaad Video
Follow us
Surya Kala

|

Updated on: Jun 13, 2023 | 12:57 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో మోటరుతో నడిచే ఒక మంచం వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో పలువురిని ఆకట్టుకుంటుంది. వైరల్ వీడియోలో ఒక యువకుడు తన నాలుగు చక్రాల మంచంమీద కూర్చుని పెట్రోల్ పంప్ వద్దకు చేరుకున్నాడు. ఈ మంచాన్ని చూసి పెట్రోల్ పంప వద్ద సిబ్బంది కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ యువకుడు లాంగ్ డ్రైవర్‌పై వెళ్దాం అని చెప్పాడు. తన స్నేహితుడిని మంచం మీద కూర్చోబెట్టి అల్లరి చేశాడు. వీడియోను షేర్ చేసి.. ఇది అద్భుతమైన ఆవిష్కరణగా పేర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ జుగాడ్ గ్రామ ప్రజలకు ఒక వరం వంటిది అని చెబుతున్నాడు ఆ యువకుడు.

ఇవి కూడా చదవండి

అయితే ఈ జుగాడ్ వీడియో పారిశ్రామికవేత్త మహీంద్రాను ఆకట్టుకోలేదు. అంతేకాదు ఇది చిలిపి జుగాడ్‌లా కనిపిస్తోంది. అంతే కాకుండా నిబంధనలను కూడా ఉల్లంఘిస్తోంది. అదే సమయంలో ఈ మంచంతో తయారు చేసిన వాహనం.. మారుమూల ప్రాంతాల్లో ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ప్రాణదాతగా మారుతుందేమో..  ఎవరికి తెలుసు అని కూడా ఆనంద్ మహీంద్రా చెప్పారు

ఇందులో మంచి విషయం ఏమిటంటే ధనిక, పేద అనే తేడా లేకుండా ఇద్దరూ సమస్యలను పరిష్కరించడానికి సాంకేతికతను ఉపయోగించాలని ఆలోచిస్తున్నారు. ఇది స్వాగతించదగినది. అదే సమయంలో మరొక వినియోగదారు వ్రాసారు.. అయితే భద్రత కూడా ముఖ్యమైన విషయమే అని మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..