Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చిరుత కూనతో చిన్నారి ఆటలు.. అరే బాబూ.. అది పిల్లిపిల్ల కాదురా అంటున్న నెటిజన్లు

వాతావరణంలో వస్తున్న మార్పులతో అరణ్య వాసాల నుంచి కౄర మృగాలు అప్పుడప్పుడు జనారణ్యంలోకి వస్తూ ఉంటాయి. అలా ఒక చిరుత పులి పిల్ల దారి తప్పి ఎలా వచ్చింది ఏమో.. ఒక బాలుడు అది పిల్లి పిల్ల అన్నట్లు చిరుతపులి పిల్లతో ఆడుకుంటున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో అందరూ షాకవుతున్నారు.

Viral Video: చిరుత కూనతో చిన్నారి ఆటలు.. అరే బాబూ.. అది పిల్లిపిల్ల కాదురా అంటున్న నెటిజన్లు
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jun 19, 2023 | 9:35 AM

అడవిలో నివసించే కౄర మృగాలంటే అందరికీ భయమే. అవి తమ జోలికి రాకపోయినా.. వాటిని చూస్తే చాలు వీలైనైనంత దూరం పారిపోతారు. సర్వ సాదరంగా ఎంతటి క్రూరజంతువైనా సరే తమ జోలికి రానంత వరకూ.. లేదా తమకి ఆకలి వేయనంత వరకూ అవి ఏమీ చేయవు. అంతేకాదు తమకు మానవులుగానీ, ఇతర జంతువులు గానీ హాని తలపెడితే మాత్రం వాటి అంతు చూసే వరకూ వదిలిపెట్టవు. ఇక పులి, చిరుతపులి, సింహంలాంటి జంతువుల గురించి చెప్పనక్కర్లేదు. అయితే వాతావరణంలో వస్తున్న మార్పులతో అరణ్య వాసాల నుంచి కౄర మృగాలు అప్పుడప్పుడు జనారణ్యంలోకి వస్తూ ఉంటాయి. అలా ఒక చిరుత పులి పిల్ల దారి తప్పి ఎలా వచ్చింది ఏమో.. ఒక బాలుడు అది పిల్లి పిల్ల అన్నట్లు చిరుతపులి పిల్లతో ఆడుకుంటున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో అందరూ షాకవుతున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

ఉత్తర ప్రదేశ్‌ మీరట్‌లోని షాజన్‌పూర్‌లో ఓ మామిడి తోటలో ఓ పదేళ్లబాలుడు ఏదో పెంపుడు కుక్కతో ఆడుకున్నట్లు చిరుత పిల్లతో ఆటలాడుతున్నాడు. ఆ చిరుత కూన మెడలో తాడు కట్టి ఉంది. ఆ కూన  మామిడిచెట్టు కింద ఉండగా బాలుడు దాన్ని పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. అది బాలుడినుంచి తప్పించుకుంటూ దొంగ పోలీసు ఆడుకుంటోంది. ఇది గమనించిన మామిడితోట యజమాని ఫారెస్ట్‌ అధికారులకు సమాచారమిచ్చాడు. వెంటనే స్పందించిన అటవీ అధికారులు అక్కడికి చేరుకొని చిరుత కూనను స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

పిల్లాడు, చిరుత కూనతో ఆడుకుంటున్న సమయంలో ఎవరు వీడియో తీశారనేది క్లారిటీ లేదు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. అసలు మామిడి తోటలోకి చిరుత పులి పిల్ల ఎలా వచ్చింది. ఆ బాలుడు అంత ధైర్యంగా ఆ పులిపట్టుకుంటున్నాడంటే పక్కన ఎవరో పెద్దవాళ్లు ఉండే ఉంటారని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వాళ్లంతా వీడు పిల్లాడు కాదు పిడుగు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అక్కడికి చిరుత పిల్ల ఎలా వచ్చింది అనే విషయంపై దర్యాప్తు చేపట్టారు అటవీ అధికారులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..