Photo Viral: పానీపూరీలో సరికొత్త ఆవిష్కరణ.. నాన్ వెజ్ పానీపూరీని అందిస్తున్న బెంగాల్ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారీ..

పులుపు-కారం, తీపి కలయికతో నోరికి రుచికరంగా ఉండే పానీపూరీని ఇష్టపడి మరీ తింటారు. అయితే పశ్చిమ బెంగాల్‌కు చెందిన స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ మెన్ సరికొత్తగా ఆలోచించి పానీపూరీని సరికొత్తగా ఆవిష్కరించాడు. ఇప్పటి వరకూ వెజ్ పానీపూరీని ఆస్వాదించిన గోల్గప్పా ప్రియులకు చికెన్ , మటన్‌తో అందిస్తున్నాడు.

Photo Viral:  పానీపూరీలో సరికొత్త ఆవిష్కరణ.. నాన్ వెజ్ పానీపూరీని అందిస్తున్న బెంగాల్ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారీ..
Non Veg Panipuri
Follow us
Surya Kala

|

Updated on: Jun 16, 2023 | 10:27 AM

గోల్గప్పా లేదా పానీపూరీ వయసు తో సంబంధం  లేకుండా అందరూ ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్. రోడ్డు పక్కన ఉన్న పనీ పురీ బండి చూస్తే చాలు వెంటనే నోటిలో నీరు తిరుగుతూ.. తినాలి అనిపిస్తుంది. అయితే గత కొంతకాలంగా ఆహార పదార్ధాలపై వింత వింత ప్రయోగాలు చేస్తూ.. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. అయితే ఇప్పుడు పానీపూరీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ పానీపూరీని చూసి గోల్ గొప్పా లవర్స్ తిట్ల దండకం అందుకుంటున్నారు.

పులుపు-కారం, తీపి కలయికతో నోరికి రుచికరంగా ఉండే పానీపూరీని ఇష్టపడి మరీ తింటారు. అయితే  పశ్చిమ బెంగాల్‌కు చెందిన స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ మెన్ సరికొత్తగా ఆలోచించి పానీపూరీని సరికొత్తగా ఆవిష్కరించాడు.  ఇప్పటి వరకూ వెజ్ పానీపూరీని ఆస్వాదించిన గోల్గప్పా ప్రియులకు చికెన్ , మటన్‌తో అందిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

అయితే కొందరు నెటిజన్లు మాత్రం నాన్ వెజ్ పానీపూరి ఏమిటంటూ ఊగిపోతున్నారు. రితుపర్ణ ఛటర్జీ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. బెంగాల్‌లోని ఒక స్ట్రీట్ ఫుడ్ షాప్ ని పరిచయం చేస్తూ  షాప్ మెనూ చిత్రాన్ని షేర్ చేసింది. ఇప్పుడు ఈ మెనూ చదివిన జనాలు షాక్ అవుతున్నారు.

రితుపర్ణ @MasalaBai హ్యాండిల్‌ లో  బెంగాల్ ప్రజలు చాలా దూరం వెళ్ళినట్లు అనిపిస్తుంది. ఒక పానీపూరీ దుకాణం వద్ద ఉన్న మెనూ ప్రకారం, చికెన్-మటన్ లతో మాత్రమే కాదు రొయ్యలతో పానీపూరీ కూడా అందిస్తున్నారు. అంతేకాదు ఈ గోల్గప్పలో మరికొన్ని రకాలు ఉన్నాయి. అయితే నాన్ వెజ్ పానీపూరీ పెద్దగా ఆకర్షించినట్లు లేదు.  వెలది వ్యూస్ ను సొంతం చేసుకున్న ఈ పోస్ట్ రకరకాల కామెంట్స్ ను కూడా సొంతం చేసుకుంది. ఇటువంటి తెలివైన వ్యక్తులు ఎక్కడ నుండి వస్తారు అని అని ఒకరంటే.. మరొకరు గొల్గప్ప విషయంలో ఇలాంటి దారుణం జరుగుతుందని తాను కలలో కూడా అనుకోలేదని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..