AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బండిలాగడానికి వృద్ధుడికి సాయం చేసిన ఆటో డ్రైవర్.. మానవత్వం ఇంకా ఉందంటున్న నెటిజన్లు

ప్రస్తుతం అందిస్తోంది కలికాలం కనుక మానవత్వం ఎక్కడ ఉందని.. మానవత్వం ఉన్న మనుషులు ఉన్నారంటూ తరచుగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అయితే మానవత్వం నిజంగా రోజు రోజుకీ కనుమరుగవుతుందని అనుకున్న ప్రతి సారి.. ఇదిగో ఇంకా మానవత్వం ఉన్న మనుషులున్నారని తెలియజేస్తూ అనేక సంఘటనలు తెలియజేస్తూ ఉంటాయి.

Viral Video: బండిలాగడానికి వృద్ధుడికి సాయం చేసిన ఆటో డ్రైవర్.. మానవత్వం ఇంకా ఉందంటున్న నెటిజన్లు
Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Jun 19, 2023 | 10:08 AM

పేదరికం చాలా దారుణం అని అది అనుభవించే వారికీ మాత్రమే ఉంటుందని కొందరు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. పేదరికంతో బాధపడే వ్యక్తి వయసుతో సంబంధం లేకుండా పని చేస్తూనే ఉంటారు. చిన్న, పెద్ద ప్రతి ఒక్కరూ తమకు తోచినంతలో పని చేస్తూ ఉంటారు. ఎందుకంటే పేద కుటుంబాలు రోజుకు రెండు పూటలా తినాలంటే శక్తికి మించి కష్టపడాల్సిందే. కాలంతో పాటు పోటీ పడుతూ సంపాదిస్తారు. ఈ నేపథ్యంలో వృద్ధులు కష్టపడి పని చేస్తూ ఉన్న అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో చాలానే కనిపిస్తూ ఉంటాయి.  అలాంటిదే ప్రస్తుతం ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దాతృత్వానికి, మానవత్వానికి ఇది సరైన ఉదాహరణగా నిలుస్తోంది.

ఈ భూమిపై కోట్లాది మంది మనుషులు ఉన్నారు. అయితే మానవత్వం గురించి మాట్లాడినట్లయితే  ఈ లక్షణాలు ఉన్నవారు అతి కొద్దిమంది మాత్రమే ప్రస్తుతం కనిపిస్తారు. వాస్తవానికి మానవత్వం అంటే ఇతరులకు సహాయం చేస్తూ.. వారి బాధలను తొలగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ప్రస్తుతం అందిస్తోంది కలికాలం కనుక మానవత్వం ఎక్కడ ఉందని.. మానవత్వం ఉన్న మనుషులు ఉన్నారంటూ తరచుగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అయితే మానవత్వం నిజంగా రోజు రోజుకీ కనుమరుగవుతుందని అనుకున్న ప్రతి సారి.. ఇదిగో ఇంకా మానవత్వం ఉన్న మనుషులున్నారని తెలియజేస్తూ అనేక సంఘటనలు తెలియజేస్తూ ఉంటాయి. అలాంటి వీడియో చూసిన తర్వాత ఎవరి హృదయమైనా సంతోషంగా మారుతుంది.. అంతేకాదు మానవత్వం ఇంకా బతికే ఉందని భావిస్తారు.

ఇవి కూడా చదవండి

వీడియోపై ఓ లుక్ వేయండి.. 

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వృద్ధుడు తన సామర్థ్యం కంటే ఎక్కువ బరువున్న బండిని లాగడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్లిప్ చూసిన వారికి బరువైన హ్యాండ్‌కార్ట్‌ని లాగడంలో ఇబ్బంది పడుతున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే అతి కష్టం మీద బరువైన బండిని లాగడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో అటుగా వస్తున్న ఓ ఆటో డ్రైవర్ .. ఇదంతా చూశాడు. జాలి కలిగినట్లుంది. వెంటనే.. తన ఆటోని ఆ బండి వెనక్కి వెళ్లి.. తీసుకుని వెళ్లి.. ఆటో ముందు చక్రంతో బండిని నెడుతూ సపోర్ట్ చేస్తున్నాడు. ఆటో డ్రైవర్ సపోర్టుతో వృద్ధుడి పని సులువుగా మారింది. దీంతో వేగంగా ఆ బండి నడకలో వేగం పుంజుకుని పరుగు పెట్టడం ప్రారంభించింది.

ఈ వీడియోను సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేశాడు. ఇప్పటికి  ఈ వీడియోను రెండు లక్షల మందికి పైగా చూశారు. భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేశారు.