Watch Video: రెండు ఏనుగుల మధ్య భీకర పోరు.. గడ్డి పోచల్లా నేలకూలిన భారీ చెట్లు..
అడవి జీవితం చాలా ప్రత్యేకమైనది. మనుషుల మాదిరిగానే.. అడవిలోనూ జంతువులు బతుకు కోసం పోరాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇటు ప్రత్యర్థులతో, అటు సజాతీయ జంతువులతోనూ అవి పోరాటం సాగిస్తాయి. మనం చాలా సందర్భాల్లో చూస్తేనే ఉంటాం.
అడవి జీవితం చాలా ప్రత్యేకమైనది. మనుషుల మాదిరిగానే.. అడవిలోనూ జంతువులు బతుకు కోసం పోరాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇటు ప్రత్యర్థులతో, అటు సజాతీయ జంతువులతోనూ అవి పోరాటం సాగిస్తాయి. మనం చాలా సందర్భాల్లో చూస్తేనే ఉంటాం. కోళ్లు, పొట్టేళ్లు, గేదెల మధ్య భీకర పోరు జరుగుతంది. ఒకదానిపై మరొకటి దాడులు చేసుకుంటాయి. ఇలాగే..అడవిలోనూ రెండు ఏనుగుల మధ్య భీకర పోరు జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ పోరు చూసి బాబోయ్ అని షాక్ అవుతున్నారు నెటిజన్లు.
ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో పర్యాటకులు సఫారీలో పర్యటిస్తుండగా.. దారి మధ్యలో రెండు ఏనుగులు వచ్చాయి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఏనుగులు.. ఆ వెంటనే ఒకదానిపై మరికొటి పోరుకు ఘీంకరించాయి. ఎదురెదురుగా నిల్చుని తలపడ్డాయి. నువ్వా నేనా సై అంటూ ఢీకొట్టుకున్నాయి. ఈ భీకర పోరులు అడవిలో ఉన్న భారీ చెట్లు సైతం పూచిక పుల్లల్లా విరిగిపోయాయి. ఈ దృశ్యాలను అతి సమీపం నుంచి చూసి పర్యాటకులు.. తమ కెమెరాల్లో వీడియో రికార్డ్ చేశారు. Untold Nature అనే ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఇది చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. భారీ కాయాలు కలిగిన రెండు ఏనుగుల ఇలా పోట్లాడుకోవడం చూస్తుంటే గుండె గుభేల్ అంటుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. వాటి పోరులో చెట్లు కూలిన దృశ్యాలు హడలెత్తిస్తు్న్నాయని, వాటి మధ్యలో మనిషి గానీ, మరే ఇతర జీవి గానీ వెళితే.. అదే చివరి క్షణాలు అవుతాయంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ వీడియోను మీరూ చూసేయండి.
వైరల్ అవుతున్న వీడియో ఇదే..
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..