Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పొరపాటున కూడా ‘విమానం’ వెనుక నిల్చోవద్దు.. లేదంటే ఇదిగో ఇలా అవుతారు..!

విమానం ఇంజిన్ నుంచి విడుదలయ్యే శక్తి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? విమానం ఇంజిన్ నుంచి వెలువడే శబ్ధం చాలా పెద్దగా ఉంటుంది. ఇక దాని శక్తి కూడా అంతకుమించి ఉంటుంది. విమానం ఇంజిన్ పవర్‌కు కింద నిల్చున్న మనుషులు ఒక్కొక్కరు ఒక్కో దిక్కు..

Viral Video: పొరపాటున కూడా ‘విమానం’ వెనుక నిల్చోవద్దు.. లేదంటే ఇదిగో ఇలా అవుతారు..!
Jet Blast
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 25, 2023 | 2:14 PM

విమానం ఇంజిన్ నుంచి విడుదలయ్యే శక్తి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? విమానం ఇంజిన్ నుంచి వెలువడే శబ్ధం చాలా పెద్దగా ఉంటుంది. ఇక దాని శక్తి కూడా అంతకుమించి ఉంటుంది. విమానం ఇంజిన్ పవర్‌కు కింద నిల్చున్న మనుషులు ఒక్కొక్కరు ఒక్కో దిక్కు ఎగిరిపడ్డారు. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ వీడియోలో విమానం అప్పుడే టేకాఫ్ అవుతోంది. ఇందులో భాగంగా లాంగ్ లెన్త్ తీసుకుని, టర్న్ తీసుకుంటుంది. అయితే, విమానం టేకాఫ్ అవడాన్ని చూసేందుకు వీలుగా అక్కడ ఓపెన్‌ ప్లేస్ ఉంది. అక్కడ నిల్చుకుని చాలామంది పర్యాటకులు విమానం టేకాఫ్ అవడాన్ని వీక్షిస్తున్నారు. విమానం రానే వచ్చింది. మెల్లగా టర్న్ తీసుకుంటుంది. అయితే, విమానం ఇంజిన్ పవర్ తెలియని జనాలు.. అక్కడే చూస్తూ, కెమెరాలతో వీడియోలు తీస్తూ నిల్చున్నారు. ఫ్లైట్ ఎదురుగా వచ్చినంతసేపు గానే ఉంది. అది టర్న్ తీసుకున్న తరువాత గానీ తెలిసింది దాని ఇంజిన్ శక్తి ఏంటో. ఇంజిన్ భాగం నుంచి వచ్చే పవర్‌ఫుల్ గాలికి రోడ్డుపై నిల్చున్న వారంతా చెల్లాచెదురుగా పడిపోయారు. ఆ తరువాత ఎక్కడివారు అక్కడ సెట్‌రైట్ అయ్యారు. అయితే, విమానం నుంచి ఇలా శక్తి వెలువడటాన్ని జెట్ బ్లాస్ట్ అని పిలుస్తారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను Callum Hodgson పేరుతో ఉన్న ట్విట్టర్‌ యూజర్ పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ శక్తిని తక్కువగా అంచనా వేయడం వల్ల జరిగిన పరిణామం ఇది అని క్యాప్షన్ పెట్టారు యూజర్. ఇక వీడియోను చూసి నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు.

జెట్ బ్లాస్ట్ అంటే ఏమిటి?

ఏవియేషన్ ప్రకారం.. జెట్ బ్లాస్ట్ అంటే జెట్-పవర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్‌ల వెనుక నుండి వచ్చే థ్రస్ట్ ఫోర్స్. విమానం రకం, పర్యావరణ పరిస్థితులు ఆధారంగా దీని ప్రభావం మారే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ జెట్ బ్లాస్ట్ ప్రభావం పెరుగుతంది. ముఖ్యంగా హెవీ-క్యాలిబర్ ఎయిర్‌క్రాఫ్ట్, హెవీ లోడెడ్ టేకాఫ్ సమయంలో ఈ జెట్ బ్లాస్ట్ పవర్ అధికంగా ఉంటుంది.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లైవ్ మ్యాచ్‌లో అవమానం.. ఒక్క మాటతో గోయెంకాకు ఇచ్చిపడేశాడుగా
లైవ్ మ్యాచ్‌లో అవమానం.. ఒక్క మాటతో గోయెంకాకు ఇచ్చిపడేశాడుగా
మధుమేహం ఉన్నవారు చెరుకు రసం తాగొచ్చా.. తాగకూడదా..?
మధుమేహం ఉన్నవారు చెరుకు రసం తాగొచ్చా.. తాగకూడదా..?
షాపింగ్ కోసం వెళ్తున్నారా.. ఈ టిప్స్ తెలుసుకోండి
షాపింగ్ కోసం వెళ్తున్నారా.. ఈ టిప్స్ తెలుసుకోండి
ఆది శంకర మఠంలో మే1న చక్ర చండీ యాగం నిర్వహణ.. పూర్తి వివరాలు
ఆది శంకర మఠంలో మే1న చక్ర చండీ యాగం నిర్వహణ.. పూర్తి వివరాలు
వీటిలో ఉప్పు కలిపితే మీ ఆరోగ్యానికి డేంజర్ బెల్స్ మోగినట్టే..!
వీటిలో ఉప్పు కలిపితే మీ ఆరోగ్యానికి డేంజర్ బెల్స్ మోగినట్టే..!
ఎవర్రా సామీ నువ్వు.. 19 బంతుల్లో ఒక్క బౌండరీ కొట్టలే..
ఎవర్రా సామీ నువ్వు.. 19 బంతుల్లో ఒక్క బౌండరీ కొట్టలే..
షుగర్ కు చెక్ పెట్టాలంటే ఉదయం లేవగానే ఈ నీళ్లు తాగాల్సిందే
షుగర్ కు చెక్ పెట్టాలంటే ఉదయం లేవగానే ఈ నీళ్లు తాగాల్సిందే
ఇంటర్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్ 2025 ఫలితాలు వచ్చేశాయ్.. డైరెక్ట్ లింక్
ఇంటర్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్ 2025 ఫలితాలు వచ్చేశాయ్.. డైరెక్ట్ లింక్
కోచ్‌గా కాదు ఓ అసలైన తండ్రిగా.. యువీ షాకింగ్ కామెంట్స్
కోచ్‌గా కాదు ఓ అసలైన తండ్రిగా.. యువీ షాకింగ్ కామెంట్స్
కెప్టెన్‌కి బహుమతిగా గోల్డ్ ఐఫోన్.. ఎత్తుకెళ్లిన తోటి ప్లేయర్
కెప్టెన్‌కి బహుమతిగా గోల్డ్ ఐఫోన్.. ఎత్తుకెళ్లిన తోటి ప్లేయర్