Viral Video: లోయ దగ్గర విన్యాసం చేసి హీరో అవ్వాలనుకుని.. జీరో అయిన యువకుడు.. షాకింగ్ వీడియో వైరల్

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి  ఏదైనా చేసేస్తున్నారు. చాలా మంది తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ముఖ్యంగా యువతలో ఈ క్రేజ్ ఎక్కువగా కనిపిస్తుంది. సినిమా చూసి ఇంప్రెస్ అయిన ఈ వ్యక్తులు కొన్నిసార్లు స్టంట్స్ చేయడం మొదలుపెడతారు. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో  చర్చనీయాంశమైంది. ఒక యువకుడు లోయ వద్ద విన్యాసాలు చేస్తూ కనిపించాడు.. ఈ సమయంలో పట్టుదప్పి ప్రాణాల పోగొట్టునే వరకూ వెళ్ళాడు.

Viral Video: లోయ దగ్గర విన్యాసం చేసి హీరో అవ్వాలనుకుని.. జీరో అయిన యువకుడు.. షాకింగ్ వీడియో వైరల్
Stunt Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Jun 24, 2023 | 12:39 PM

స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ సోషల్‌మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల  వీడియోలు, రీళ్లు సందడి చేస్తున్నారు. చాలామంది తమ జీవనోపాధికోసం డబ్బులు సంపాదించడానికి మార్గంగా కూడా ఎంచుకుంటున్నారు కూడా.. అలాంటి వారిలో కొందరు వ్యక్తులు నేడు లక్షలు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అయితే వీడియోలను రూపొందించే క్రమంలో కొందరు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రకరకాల విన్యాసాలు చేస్తూ.. ప్రాణాలను ప్రమాదంలో పడేకుంటున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా వీడియో  షూట్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకీ అధికంగా అవుతుందని చెప్పవచ్చు. రైల్వే ట్రాక్, సముద్రం, కదిలే రైలు, కదిలే బైక్ లేదా కారుపై స్టంట్ వీడియోలను చిత్రీకరిస్తూ చాలాసార్లు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటున్నారు.

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి  ఏదైనా చేసేస్తున్నారు. చాలా మంది తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ముఖ్యంగా యువతలో ఈ క్రేజ్ ఎక్కువగా కనిపిస్తుంది. సినిమా చూసి ఇంప్రెస్ అయిన ఈ వ్యక్తులు కొన్నిసార్లు స్టంట్స్ చేయడం మొదలుపెడతారు. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో  చర్చనీయాంశమైంది. ఒక యువకుడు లోయ వద్ద విన్యాసాలు చేస్తూ కనిపించాడు.. ఈ సమయంలో పట్టుదప్పి ప్రాణాల పోగొట్టునే వరకూ వెళ్ళాడు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఈ ప్రమాదకరమైన వీడియోలో, ఒక యువకుడు  లోయ దగ్గర ఉన్న రహదారిపై నిర్మించిన ఒక గోడ దగ్గర విన్యాసాలు చేయడానికి ప్రయత్నించాడు. గోడ అంచున నిలబడి బ్యాక్‌ఫ్లిప్ చేయడానికి ప్రయత్నించాడు. తన చుట్టూ ఉన్న టూరిస్ట్‌ని చూసి.. ఆ యువకుడు చాలా ప్రేరణ పొంది.. బ్యాక్  ఫ్లిప్ కొట్టాడు.. అయితే పొరపాటు జరిగి ఆ యువకుడు లోయలో పడిపోయాడు. అతను పడిపోయిన తీరును చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.

ఈ వీడియో @NoContextHumans అనే ట్విట్టర్‌ ఖాతాలో షేర్లో చేశారు.  ఇప్పటి వరకూ 43 లక్షల మందికి పైగా ఈ వీడియోను చూశారు. భిన్నమైన కామెంట్స్ చేశారు.  ఒకరు ఆ యువకుడి మెడ విరిగి ఉండాలని అంటే.. మరొకరు ‘పర్వతాల వద్దకు వెళ్లి ఇలాంటి పనులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని అంటే.. మరొకరు ‘హే సోదరా, లోయ దగ్గర  స్టంట్ చేయమని మీకు ఎవరు చెప్పారని వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..