Success Story: 11 ఏళ్లకు పెళ్లి, 20 ఏళ్లకు తండ్రి.. చదువుకోసం ఇంటి నుంచి పారిపోయి నేడు నీట్ ర్యాంకర్
రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ జిల్లాకు చెందిన రాంలాల్ భోయ్ కు డాక్టర్ కావాలని కోరిక. దీంతో రామ్ లాల్ చదువుకునే సమయంలో వచ్చిన ప్రతి సమస్యతో పోరాడుతూ.. కృషి, పట్టుదలతో చదువుకుని తన లక్ష్యాన్ని సాధించాడు. నీట్ యూజీ పరీక్షలో 632 మార్కులు సాధించాడు.
ప్రతి మనిషి జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి.. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం కృషి, పట్టుదలతో కష్టపడాలి. అప్పుడు మాత్రమే నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు.. అంతేకాదు తమకంటూ చరిత్రలో ఒక పేజీ లిఖించుకోవచ్చు. అలాంటి వ్యక్తులు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తారు. తాజాగా ఓ యువతి నీట్ పరీక్షలో మంచి మార్కులు సాధించి వార్తల్లో నిలిచింది. వాస్తవానికి ఇటీవల రిలీజైన ఆల్ ఇండియా మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ ( NEET 2023) లో అనేక మంది స్టూడెంట్స్ మంచి మార్కులు సాధించారు. 700 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు వందల్లో ఉన్నారు. కానీ 632 మార్కులు సాధించిన రాజస్థాన్‌కు చెందిన యువకుడు రాంలాల్ భోయ్ మంత్రం అందరికంటే వెరీ వెరీ స్పెషల్. అంతేకాదు నేటి తరానికి ప్రతినిధి అయిన ఈ యువకుడు స్ఫూర్తి కూడా.. ఎందుకంటే రాంలాల్ ఒక చిన్నారి బాలికకు తండ్రి. అయితే డాక్టర్ అవ్వాలనే కోరికతో రామ్ లాల్ నీట్ లో సీటు కోసం పడిన కష్టం లక్షలాది మంది యువతకు స్ఫూర్తినిస్తుంది. వివరాల్లోకి వెళ్తే..
రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ జిల్లాకు చెందిన రాంలాల్ భోయ్ కు డాక్టర్ కావాలని కోరిక. దీంతో రామ్ లాల్ చదువుకునే సమయంలో వచ్చిన ప్రతి సమస్యతో పోరాడుతూ.. కృషి, పట్టుదలతో చదువుకుని తన లక్ష్యాన్ని సాధించాడు. నీట్ యూజీ పరీక్షలో 632 మార్కులు సాధించాడు. భారతదేశం మొత్తంలో 12901 ర్యాంకర్ గా నిలవగా అదే సమయంలో రాష్ట్ర కేటగిరీ ర్యాంక్‌లో 5137వ స్థానం సొంతం చేసుకున్నాడు.
11 సంవత్సరాల వయస్సులో మాత్రమే వివాహం రాంలాల్ ది బాల్య వివాహం. 11 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకున్నాడు. పెళ్లి జరిగిన సమయంలో 6వ తరగతి చదువుతున్నాడు. అప్పుడు చదువుకోసం చాలా ఇబ్బంది పడ్డాడు. రామ్ లాల్ తండ్రికి కూడా కొడుకు చదువుకోవడం ఇష్టం ఉండేది కాదు. అంతేకాదు చదువు మానెయ్యమంటూ.. రాంలాల్‌ను పలుమార్లు తండ్రి కొట్టాడు కూడా..
రాంలాల్ తల్లిదండ్రులిద్దరూ నిరక్షరాస్యులు. తమ కొడుకు చదువుకోవడం ఇష్టం లేదు. రాంలాల్‌ను 10వ తరగతి చదివించడం కూడా తండ్రికి ఇష్టం లేదు. అయినపప్పటికీ తండ్రి దెబ్బలను ఎదుర్కొంటు రాంలాల్ 10వ తరగతి పరీక్షలో 74 శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు.ఇంటర్ చదువుకోలేని భావించిన రాంలాల్ ఇంటి నుంచి పారిపోయి ఉదయపూర్ కు చేరుకున్నాడు. 2019లో 12వ తరగతి పరీక్షలో 81 శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు.
నీట్ కు ప్రిపేర్.. 12వ తరగతి పాసయ్యాక రాంలాల్ చాలా కష్టపడి నీట్‌కు ప్రిపేర్ అయ్యాడు. 20 సంవత్సరాల వయస్సులో రామ్ లాల్ కు కూతురు పుట్టింది. తండ్రి అవ్వడంతో కుటుంబ బాధ్యత మరింత వచ్చి.. చదువు సరిగ్గా సాగలేదు. దీంతో నీట్ ఎంట్రెన్స్ లో మొదటి ప్రయత్నంలో 350 మార్కులు మాత్రమే సాధించాడు. ఇలా నాలుగు సార్లు నీట్ ఎంట్రెన్స్ రాశాడు. నాలుగో ప్రయత్నంలో రాంలాల్‌కు 490 మార్కులు వచ్చాయి. అయినప్పటికీ నిరాశ చెందక మళ్ళీ నీట్ ప్రవేశ పరీక్షను రాశాడు. చివరకు ఐదో సారి సక్సెస్ అందుకున్నాడు. నీట్ యూజీ పరీక్షలో 632 మార్కులు సాధించాడు. తాను కలలు కన్న వైద్య విద్యను అభ్యసించడానికి రెడీ అవుతున్నాడు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..