Farmer Success Story: చదివింది 10 వ తరగతి.. సేంద్రీయ వ్యవసాయంతో ఏటా రూ. 70 లక్షల ఆదాయం.. యువకుడి సక్సెస్ స్టోరీ..

తన తండ్రిలా ఎరువులతో పండే పంటలు తిని వ్యాధుల బారిన పడకుండా ఉండాలని భావించి సేంద్రియ వ్యవసాయం చేయాలనీ ఆలోచించాడు. ఇప్పుడు తాను పండిస్తున్న పంటలతో నేడు ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం ద్వారా ఏటా కోటి రూపాయల విలువైన దిగుబడిని పొందుతున్నాడు. అబ్దుల్ రజాక్ తన 10 ఎకరాల భూమిలో సేంద్రియ వ్యవసాయం ద్వారా దోసకాయ, టమాటా, క్యాప్సికం, ఆనపకాయ వంటి కూరగాయలతో పాటు జామ, నారింజ వంటి పండ్లను పండిస్తున్నాడు.

Farmer Success Story: చదివింది 10 వ తరగతి.. సేంద్రీయ వ్యవసాయంతో ఏటా రూ. 70 లక్షల ఆదాయం.. యువకుడి సక్సెస్ స్టోరీ..
Farmer Success Story
Follow us
Surya Kala

|

Updated on: Jun 25, 2023 | 12:51 PM

కృషి, పట్టుదల అంకితభావంతో ఎవరైనా సరే పనిచేసే తమ జీవితాన్ని తామే మార్చుకోవచ్చని నిరూపించాడు రాజస్థాన్‌లోని భిల్వారాకు చెందిన అబ్దుల్ రజాక్ అనే రైతు. రసాయనిక ఎరువులతో పండించిన పంటలు తిన్న వృద్ధుడైన తండ్రి క్యాన్సర్ బారిన పడి మరణించాడు. తండ్రి మరణంతో కుమారుడు అబ్దుల్ రజాక్ లో ఆలోచన రేకెత్తించింది. అంతేకాదు తన తండ్రిలా ఎరువులతో పండే పంటలు తిని వ్యాధుల బారిన పడకుండా ఉండాలని భావించి సేంద్రియ వ్యవసాయం చేయాలనీ ఆలోచించాడు. ఇప్పుడు తాను పండిస్తున్న పంటలతో నేడు ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం ద్వారా ఏటా కోటి రూపాయల విలువైన దిగుబడిని పొందుతున్నాడు.

అబ్దుల్ రజాక్ తన 10 ఎకరాల భూమిలో సేంద్రియ వ్యవసాయం ద్వారా దోసకాయ, టమాటా, క్యాప్సికం, ఆనపకాయ వంటి కూరగాయలతో పాటు జామ, నారింజ వంటి పండ్లను పండిస్తున్నాడు. ప్రస్తుతం తాను పండిస్తున్న పంటల ద్వారా ఏటా రూ.కోటి సంపాదిస్తున్నాడు. ఇందులో దాదాపు రూ.30 లక్షల వరకు పంట పెట్టుబడిగా ఖర్చు అవుతుంది. మిగిలిన రూ.70 లక్షలు నికర లాభం. అంటే అబ్దుల్ ఏడాదికి రూ. 70 లక్షలను సంపాదిస్తున్నాడు.

అబ్దుల్ రజాక్ సేంద్రియ వ్యవసాయం చేయడానికి సొంతంగా బయోలాజికల్ లేబొరేటరీని ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు ఇప్పుడు తన తో పాటు ఇతర రైతులకు సేంద్రియ వ్యవసాయం చేయడానికి దిశా నిర్దేశాన్నీ చూపిస్తున్నాడు. అబ్దుల్ రజాక్‌ను రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాఖ సన్మానించింది.  అబ్దుల్ రజాక్  సొంతంగా బయోలాజికల్ లాబొరేటరీని ఏర్పాటు చేసి.. సేంద్రీయ ఎరువులు, సేంద్రీయ రసాయనాలను తయారు చేశాడు.

ఇవి కూడా చదవండి

అబ్దుల్ రజాక్ తెలిపిన వివరాల ప్రకారం.. 2006లో పదో తరగతి ఉత్తీర్ణత అయిన వెంటనే వ్యవసాయం చేయాలనే ఆలోచన వచ్చింది. 2010 సంవత్సరంలో  60ఏళ్ల అబ్దుల్ తండ్రి హరూన్ ఆజాద్ క్యాన్సర్‌ బారిన పడ్డాడు. తన తండ్రికి దోసకాయలు తినడం ఇష్టమని.. అవి పాలీహౌస్‌లోని రసాయనిక ఎరువులు నుండి ఉత్పత్తి చేయబడిందని.. అందుకనే తండ్రికి క్యాన్సర్ సోకిందని తెలుసుకున్నాడు. రెండేళ్ల తర్వాత 2012లో తండ్రి చనిపోవడంతో అబ్దుల్ సేంద్రియ వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకున్న 10 ఎకరాల భూమిలో 2 ఎకరాల్లో జామ, నారింజ, మిగిలిన 8 ఎకరాల్లో కూరగాయలు సాగు చేశాడు.

తన ఉత్పత్తులన్నీ భిల్వారా మండిలో అమ్ముడవుతాయని అబ్దుల్ రజాక్ చెప్పారు. వ్యవసాయం చేయడానికి  కేవలం సేంద్రియ ఎరువు, వర్మీకంపోస్టు, ఇతర సహజ క్రిమిసంహారక మందులనే వాడుతున్నాడు. పంటలకు జీవామృతం, ఆవు మూత్రం, దేశి ఎరువు ,పచ్చి ఎరువుతో పాటు బాక్టీరియల్ కల్చర్, బయో-పెస్టిసైడ్, క్రిసోపా వంటి బయో ఏజెంట్లను ఉపయోగిస్తాడు. దీంతో పంట దిగుబడి పెరుగుతుంది.

రాష్ట్రం నలుమూలల నుండి రైతులు అబ్దుల్ రజాక్ వద్దకు వ్యవసాయం గురించి తెలుసుకోవడానికి వస్తారు. సేంద్రియ వ్యవసాయం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అబ్దుల్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఉచిత సమాచారం కూడా ఇస్తున్నాడు.

అయితే సేంద్రియ వ్యవసాయం చేసే అబ్దుల్ రజాక్ పెద్దగా చదువుకోలేదని వ్యవసాయ శాఖ అధికారులు  అన్నారు. చదివింది కేవలం 10వ తరగతి మాత్రమే. అయితే సేంద్రియ వ్యవసాయం చేసే వినూత్నమైన రైతు. అన్ని రకాల సేంద్రియ ఎరువులు, పురుగుమందులు తానే తయారు చేసుకుంటూ అన్నదాతగా సంచలనం సృష్టిస్తున్నాడు. ఓ వైపు ఆర్గానిక్ ఫార్మింగ్ తో పాటు మరోవైపు కోళ్ల పెంపకాన్నికూడా చేస్తున్నాడు. అబ్దుల్‌ వద్ద 10,000 కంటే ఎక్కువ పౌల్ట్రీ పక్షులు ఉన్నాయి. ఆలోచన కష్టపడే తత్వం ఉంటె సంపాదించాలంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు అవసరం లేదు.. వ్యవసాయంలో కూడా సంపాదించవచ్చు అని నిరూపిస్తూ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు అబ్దుల్ రజాక్.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..