Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Social Media Star: 2 భార్యలు, 9 పిల్లలు, 6 ప్రియురాళ్లు లగ్జరీ లైఫ్ కోసం నేరాలు .. సోషల్ మీడియా స్టార్ అరెస్ట్

ధర్మేంద్ర కుమార్ ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత పోలీసులు నిందితుడి గురించి విచారణ చేపట్టారు.  కొంత మంది వ్యక్తులకు డబ్బు రెట్టింపు పేరుతో రూ. 3 లక్షలు మోసం చేశాడని ఆరోపించారు. ముంబై లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో ఫాల్స్‌ సీలింగ్‌ తయారీలో అజీత్‌ విఫలమవడంతో మోసాలు చేయడం మొదలు పెట్టాడని ఎస్‌హెచ్‌వో సరోజినీనగర్‌ శైలేంద్ర గిరి తెలిపారు. “ముంబైలో అతను 2000లో సంగీత (40)ని వివాహం చేసుకున్నాడు. సంగీతకు అజిత్ దంపతులకు ఏడుగురు పిల్లలు. 2010లో ఉద్యోగం పోగొట్టుకున్నాడు

Social Media Star: 2 భార్యలు, 9 పిల్లలు, 6 ప్రియురాళ్లు లగ్జరీ లైఫ్ కోసం నేరాలు .. సోషల్ మీడియా స్టార్ అరెస్ట్
Social Media Star Ajeet
Follow us
Surya Kala

|

Updated on: Nov 30, 2023 | 5:49 PM

అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు పెద్దలు.. మన ఆర్ధిక స్తోమతకు, శక్తికి మించి భారాన్ని మోయాలంటే అది కూడా లగ్జరీ లైఫ్ ను లీడ్ చేయాలనుకుంటే ఎక్కువగా మోసం చేయడానికి తద్వారా బాగా సంపాదించానికి కొందరు అలవాటు పడతారు. అలా ఆరవ తరగతి చదువుతూ మానేసిన ఓ వ్యక్తి నేరాలుమోసాలు చేస్తూ జీవించడానికి అలవాటు పడ్డాడు. ఎందుకంటే ఇతను ఇద్దరు భార్యలు.. తొమ్మిది మంది పిల్లల సహా ఆరుగురు ప్రియురాలిని పోషిచాల్సి వచ్చింది మరి. సోషల్ మీడియా స్టార్ అజీత్ మౌర్య (41)  తన భార్యలతో కలిసి సముద్ర తీరంలో న్యూఇయర్ వేడుకలను జరుపుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

విమానంలో వెళ్లేందుకు ట్రిప్ ప్లాన్ చేస్తూ హోటల్‌లో భోజనం చేస్తున్నాడు అజీత్ మౌర్య. అయితే బుధవారం సరోజినీనగర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేయడంతో అతని ప్లాన్ ప్లాప్ అయింది. ఆరవ తరగతి డ్రాపౌట్ అయిన అజీత్, ఇద్దరు భార్యలు, తొమ్మిది మంది పిల్లలతో పాటు ఆరుగురు ప్రియురాళ్లను పోషించాలి కనుక తాను నేరాలు చేస్తున్నానని పోలీసులకు చెప్పి షాక్ ఇచ్చాడు.

అజీత్ మౌర్య సోషల్ మీడియా సైట్లలో రీల్స్ చేస్తాడు. ఎన్నో మోసాలు చేసిన అజిత్ తొమ్మిది క్రిమినల్ కేసుల్లో నేరస్తుడు. స్కీమ్‌ల వంటి నకిలీ ఫ్లోటింగ్ పోంజీలను అమలు చేయడం, నకిలీ భారతీయ కరెన్సీ నోట్లను చెలామణి చేయడం, బీమా పథకాలతో ప్రజలను మోసం చేయడం సహా అనేక ఇతర కేసులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ధర్మేంద్ర కుమార్ ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత పోలీసులు నిందితుడి గురించి విచారణ చేపట్టారు.  కొంత మంది వ్యక్తులకు డబ్బు రెట్టింపు పేరుతో రూ. 3 లక్షలు మోసం చేశాడని ఆరోపించారు. ముంబై లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో ఫాల్స్‌ సీలింగ్‌ తయారీలో అజీత్‌ విఫలమవడంతో మోసాలు చేయడం మొదలు పెట్టాడని ఎస్‌హెచ్‌వో సరోజినీనగర్‌ శైలేంద్ర గిరి తెలిపారు. “ముంబైలో అతను 2000లో సంగీత (40)ని వివాహం చేసుకున్నాడు. సంగీతకు అజిత్ దంపతులకు ఏడుగురు పిల్లలు. 2010లో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. దీంతో భార్య పిల్లల్తో గోండాలోని తన గ్రామానికి తిరిగి వచ్చాడు. అయితే ఇక్కడ కూడా అతనికి మంచి ఉద్యోగం దొరకలేదు అని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత, అతను నేరాలు చేయడం మొదలు పెట్టాడు. 2016లో దొంగతనం, ఆక్రమణలపై గోండాలో అతనిపై మొదటి కేసు నమోదు అయింది. అలా మొదలైన నేర చరిత్ర.. అజీత్ మళ్ళీ వెనుదిరిగి చూడలేదు.

“రెండేళ్ల తర్వాత సుశీల (30) అనే యువతితో పరిచయం ఏర్పడింది.. మోసం చేయడానికి కొత్త మార్గాలను ఎంచుకున్నాడు. నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేయడం, స్కీమ్‌ల వంటి ఫ్లోటింగ్ పోంజీలను ప్రారంభించాడు.. అని సీనియర్ క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది తెలిపారు. తర్వాత ఈ ఇద్దరు.. మరికొందరితో కలిసి నేరాల సంఖ్యను పెంచారు. 2019లో అజిత్ సుశీలను పెళ్లాడాడు. అప్పటి నుంచి అజిత్ .. రాజులా జీవించడం ప్రారంభించాడు.. సుశీల ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.

కాలక్రమంలో అజిత్ రెండు ఇళ్లను నిర్మించాడు. ఒకటి మొదటి భార్య సంగీత నివాసం.. మరొకటి సుశీల ఆమె పిల్లల కోసం. అయినప్పటికీ అజిత్ అద్దెకు తీసుకున్న ఇంట్లోనే నివసిస్తున్న విషయం పోలీసుల విచారణలో వెల్లడైంది. అజీత్ తన భార్యలిద్దరికి విలాసవంతమైన జీవితాన్నికల్పిస్తున్నాడు. తాను నేరాలతో ‘దోపిడీ’ చేసిన డబ్బులను ఇద్దరి భార్యలకు సమానంగా పంపిణీ చేస్తాడు.

పోలీసులు అతని కాల్ డేటా ఆధారంగా అజీత్‌కు ఆరుగురు ప్రియురాళ్లు ఉన్నారని.. వారిని దూర ప్రయాణాలకు తీసుకెళ్లేవాడని గుర్తించారు. యువతులను అజిత్ తన సోషల్ మీడియా ద్వారా ఆకర్షించి వారిని తన వలలో వేసుకునేవాడని పోలీసులు చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..