Mother’s Love: ప్రమాదంలో మృతి చెందిన కొడుకు.. అలా ఆనందాన్ని వెతుక్కున్న మాతృమూర్తి..

తల్లీపిల్లల బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.. సృష్టిలో అపురూపమైన బంధం తల్లీబిడ్డల బంధం. అలంటి ఓ తల్లి తన కుమారుడిని ఓ ప్రమాదంలో పోగొట్టుకుంది. తన కొడుకు జ్ఞాపకార్ధం హిందువులు పవిత్రంగా భావించి పూజించే గోమాతలకు ఆశ్రయం కల్పించాలని భావించింది. అందుకు శ్రీకారం చుట్టి తన కొడుకు జ్ఞాపకార్ధం గోశాలను ఏర్పాటు చేసింది. ఈ ప్రేమకు వేదికగా కర్ణాటకలోని హావేరిలో చోటు చేసుకుంది. 

Surya Kala

|

Updated on: Nov 21, 2023 | 3:56 PM

తన కుమారుడి జ్ఞాపకార్థం ఓ తల్లి హావేరి తాలూకా గాంధీపుర గ్రామ సమీపంలో ఎకరం భూమిని కొనుగోలు చేసి అతని పేరిట సందేశ్ గోశాలను ఏర్పాటు చేసింది. హుక్కేరిమఠం సదాశివశ్రీ సందేశ గోశాలను ప్రారంభించారు. నాలుగైదు నెలల క్రితం బెల్గాం వెళ్లినప్పుడు ప్రమాదంలో చనిపోయాడు.

1 / 7
చనిపోయిన తన కుమారుడి పేరు మీద ఓ తల్లి గోశాలను నిర్మించి.. మరణించిన తన కుమారుడి జయంతి  సందర్భంగా అంకితమిచ్చిన ఘటన చోటుచేసుకుంది.

2 / 7
హవేరి తాలూకా గాంధీపూర్ గ్రామ సమీపంలో సందేశ్ గోశాల నిర్మించింది మృతుడి తల్లి సంగీత. ఆమె  ఒక్కగానొక్క కొడుకు సందేశ్ హుబ్లీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అయితే నాలుగైదు నెలల క్రితం బెల్గాం వెళ్లినప్పుడు ప్రమాదంలో చనిపోయాడు.

3 / 7
కొడుకు జ్ఞాపకాలతో తల్లి కన్నీరు పెట్టని సమయం లేదు.. ఎందుకంటే సంగీత లోకం అంతా ఒక్కగానొక్క కొడుకు సందేశ్ లోకం మరి.  తనయుడిని కోల్పోయిన సంగీతకు అంతా కొడుకే. తన కుమారుడి జ్ఞాపకార్థం ఉట్టిగోస్కర్ గాంధీపుర గ్రామ సమీపంలో ఒక ఎకరం భూమిని కొనుగోలు చేసి అతని పేరిట సందేశ్ గోశాలను నెలకొల్పింది. హుక్కేరిమఠం సదాశివశ్రీ సందేశ గోశాలను ప్రారంభించారు.

4 / 7
కొడుకు మంచి మనిషి అని .. తన అందమైన కొడుకుని కోల్పోయిన తల్లి సంగీత ప్రస్తుతం జంతువులకు ఆశ్రయం కల్పించే గోశాలను అప్పు చేసి మరీ నిర్మించింది. ఇందుకు కోసం సుమారు రూ.50 లక్షల అప్పులు చేసింది. 

5 / 7
రైతుల వద్ద ఉన్న పశువులను మాత్రమే కాదు.. రోడ్డుమీద విడిచి పెట్టే పశువులు, సంతానం లేని ఆవులు, పశుగ్రాసం లేక ఇబ్బందులు పడుతున్న రైతులు ఇక్కడ గోశాలకు తరలించవచ్చు. రైతులు ఇక్కడ గోశాలలో జంవుతులను తమ కొడుకులుగా పెంచేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. పవిత్రమైన ఆవులు కాపాడే పనిని తల్లి సంగీత చేస్తోంది.

6 / 7
వర్షాభావ పరిస్థితుల్లో పశువులకు మేత కూడా అందడం లేదు. దీంతో ఇప్పుడు ఈ గోశాలను తన భర్తతో కలిసి ఏర్పాటు చేసి.. ఆవులను పెంచుతూ తమ కొడుకును చూసుకుంటున్నారు. 

7 / 7
Follow us