Viral: ప్రియుడికోసం పాకిస్తాన్‌కి.. పిల్లలు గుర్తొస్తున్నారంటూ తిరిగి ఇండియాకి వచ్చిన అంజూ..
ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడి కోసం పాకిస్థాన్‌కు వెళ్లి, అక్కడే రెండోపెళ్లి చేసుకున్న రాజస్థాన్ యువతి తిరిగి భారత్‌కు వచ్చింది. అట్టారి వాఘా బోర్డర్ నుంచి ఆమె భారత్‌లోకి బుధవారం స్వదేశంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్‌లోని గ్వాలియర్‌కు చెందిన వివాహిత అంజూ పాక్‌కు చెందిన నస్రుల్లా అనే యువకుడితో 2019లో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. నస్రుల్లాను కలిసేందుకు పాక్‌కు వెళ్లిన ఆమె, అనూహ్యంగా అతణ్ని పెళ్లి చేసుకుంది.
ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడి కోసం పాకిస్థాన్‌కు వెళ్లి, అక్కడే రెండోపెళ్లి చేసుకున్న రాజస్థాన్ యువతి తిరిగి భారత్‌కు వచ్చింది. అట్టారి వాఘా బోర్డర్ నుంచి ఆమె భారత్‌లోకి బుధవారం స్వదేశంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్‌లోని గ్వాలియర్‌కు చెందిన వివాహిత అంజూ పాక్‌కు చెందిన నస్రుల్లా అనే యువకుడితో 2019లో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. నస్రుల్లాను కలిసేందుకు పాక్‌కు వెళ్లిన ఆమె, అనూహ్యంగా అతణ్ని పెళ్లి చేసుకుంది. నస్రుల్లా బుధవారం సరిహద్దుదాకా ఆమె వెంట వచ్చి భారత్‌లోకి సాగనంపాడు. రాజస్థాన్‌లోని భీవాడీకి చెందిన అంజూకు అప్పటికే వివాహమై 15 ఏళ్ల కుమారుడు, ఆరేళ్ల కుమార్తె ఉన్నారు. 2019లో ఆమె నస్రుల్లా అనే పాకిస్థాన్ యువకుడిని ఫేస్‌బుక్ ద్వారా కలిసింది. అనంతరం వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ ఏడాది జూన్‌లో తన కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆమె నస్రూన్‌ను కలిసేందుకు పాక్‌కి వెళ్లింది. అయితే తన భర్తకు మాత్రం జైపూర్ వెళ్తున్నట్లు చెప్పింది.
తీరా చూస్తే ఆమె పాక్‌లో ప్రత్యక్షమైంది. పాక్‌లో అంజూ తన ప్రియుడు నస్రుల్లాను వివాహం చేసుకునేందుకు ఇస్లాం మతాన్ని స్వీకరించింది. పాక్‌లో అతన్ని పెళ్లి చేసుకున్నాక ఆమె పేరును ఫాతిమాగా మార్చుకుంది. ఆమె నిర్వాకంతో భారత్‌లోని కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో నస్రుల్లా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. అంజూ తిరిగి భారత్‌కు వస్తుందని చెప్పాడు. ఆమె మానసిక వేదనతో బాధపడుతోందని, తన ఇద్దరు పిల్లలపై బెంగ పెట్టుకున్నట్లు అతడు వెల్లడించాడు. ఆమె పిల్లలను కలిసేందుకు భారత్‌లోని ఇంటికి వెళ్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అంజూ వెంటన తాను కూడా భారత్‌కు వచ్చేందుకు సిద్ధపడ్డానన్నాడు. అయితే వీసా విషయంలో ఇబ్బంది కారణంగా రాలేకపోయినట్లు తెలిపాడు. అంజూ మొదటి భర్త అరవింద్ భివాడి ఆమెపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకుందని అంజూపై ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ప్రస్తుతం అరవింద్ తన పిల్లలతో ఎక్కడ నివసిస్తున్నాడనేది స్పష్టంగా తెలియరాలేదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.