Minister Roja: చిరు వ్యాపారుల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేసిన మంత్రి రోజా.. రోడ్డు పక్కన మొక్కజొన్నపొత్తు తింటూ ఎంజాయ్..
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గ ప్రజలు రోడ్డుపై చేస్తున్న చిరు వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. రోడ్డు పక్కన అమ్ముతున్న మొక్కజొన్న కంకిని మంత్రి రోజా కొనుగోలు చేసి తిన్నారు. సరదాగా మొక్కజొన్న విక్రయిస్తున్న వడమాల పేటకు చెందిన ఒక మహిళతో కాసేపు మాట్లాడారు. మొక్కజొన్న పొత్తులు అమ్మితే రోజుకు ఎంత ఆదాయం వస్తుందని ఆ మహిళను ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా రోడ్డు పై మొక్కజొన్న తిని సరదా గడిపారు. వడమాల పేట మండలం కాయం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్తూ ఎస్వీ పురం టోల్ గేట్ వద్ద రోడ్డుపై ఆగారు. ఈ సందర్భంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గ ప్రజలు రోడ్డుపై చేస్తున్న చిరు వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. రోడ్డు పక్కన అమ్ముతున్న మొక్కజొన్న కంకిని మంత్రి రోజా కొనుగోలు చేసి తిన్నారు. సరదాగా మొక్కజొన్న విక్రయిస్తున్న వడమాల పేటకు చెందిన ఒక మహిళతో కాసేపు మాట్లాడారు. మొక్కజొన్న పొత్తులు అమ్మితే రోజుకు ఎంత ఆదాయం వస్తుందని ఆ మహిళను ప్రశ్నించారు.
అల్పపీడనం ప్రభావంతో వర్షం పడుతుండటంతో వాతావరణం చల్లగా మారిపోయింది. దీంతో మంత్రి రోజు నిప్పులపై కాల్చిన వేడి వేడి మొక్కజొన్న ను తీసుకుని తింటూ చల్ల చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రయాణం సాగించారు మంత్రి ఆర్కే రోజా. చిరు వ్యాపారులకు బై చెప్పి వెళ్ళిపోయారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..