Dangerous Snake: విశాఖ తీరంలో మత్స్యకారుల వలలో డేంజరస్ పాము.!
విశాఖ సాగర తీరంలో ప్రమాదకర పాము కలకలంరేపింది. నగర పరిధిలోని సాగర్‌నగర్ సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు మంగళవారం ఓ విషపూరిత పాము చిక్కింది. చేపలతో పాటూ వలలో ఈ పామును మత్స్యకారులు గుర్తించారు. ఆహార అన్వేషణలో భాగంగా చేపల గుంపుల్లో కలిసిపోయిన సందర్భాల్లో ఇవి వలల్లో చిక్కుకుంటాయని తెలిపారు. సుమారు ఏడు అడుగులు పొడవు ఉన్న ఈ పామును మత్స్యకారులు తిరిగి సురక్షితంగా సముద్రంలోకి విడిచిపెట్టారు.
విశాఖ సాగర తీరంలో ప్రమాదకర పాము కలకలంరేపింది. నగర పరిధిలోని సాగర్‌నగర్ సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు మంగళవారం ఓ విషపూరిత పాము చిక్కింది. చేపలతో పాటూ వలలో ఈ పామును మత్స్యకారులు గుర్తించారు. ఆహార అన్వేషణలో భాగంగా చేపల గుంపుల్లో కలిసిపోయిన సందర్భాల్లో ఇవి వలల్లో చిక్కుకుంటాయని తెలిపారు. సుమారు ఏడు అడుగులు పొడవు ఉన్న ఈ పామును మత్స్యకారులు తిరిగి సురక్షితంగా సముద్రంలోకి విడిచిపెట్టారు. సముద్ర జలాల్లో చాలా లోపల సంచరించే ఈ జీవి సాంకేతిక నామం హైడ్రో ఫిస్ సీ స్నేక్ అని మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి శ్రీనివాసరావు తెలిపారు. ఇవి చాలా విషపూరిత మైనవని, ఇవి కరిస్తే ప్రాణాలకే ప్రమాదమని చెప్పారు. ఈ పాముకాటుకు గురైతే సకాలంలో వైద్యం చేయించుకోవాలని, లేదంటే ప్రాణాలు పోయే ప్రమాదముందన్నారు. చిన్న చేపలు, రాళ్లలోని నాచు తింటూ సముద్రంలో జీవిస్తాయని తెలిపారు. దీనిని మత్స్యకారులు సముద్రపు కట్ల పాముగా పిలుస్తుంటారు. ఈ పాము విషయంలో జాగ్రత్త అవసరం అంటున్నారు. అయితే సముద్రం లోపల ఉండే పాములు చాలా అరుదుగా తీరానికి వస్తాయని, ఇలా మత్స్యకారుల వలకు చిక్కుతాయని తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
రహదారుల పై గజరాజుల బీభత్సం వీడియో
వామ్మో.. ఎటు చూసినా పాములే.. భయంతో వణకిపోతున్నారు!
చదువుకోవాలని ఉంది.. కాస్త బస్సు ఆపించండి సార్..
అయ్యో.. సెల్ఫీ సరదా ఎంతపని చేసింది!
ఫుల్‌గా మందుకొట్టి.. బస్ కింద దూరి మందుబాబు రచ్చ!
వామ్మో.. అది ఇల్లా పాముల పుట్టా.. ఏకంగా 40 నాగుపాముల పడగ విప్పి
అయ్యో.. ఆ ఊర్లో 12 ఏళ్లుగా ఒక్క పెళ్లీ జరగలేదట.. కారణం ఏంటంటే

