మీరు కూడా బరువు తగ్గాలనుకుంటున్నారా..? రాత్రి పడుకునే ముందు ఈ చిట్కాలు పాటించండి.. స్లిమ్‌ అవుతారు..!

రాత్రుళ్లు నిద్రపోయేటప్పుడు మెలటోనిన్ అనే హార్మోన్ మన శరీరంలో బ్రౌన్ ఫ్యాట్‌ను సృష్టించి కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుందని పరిశోధనలో తేలింది. చీకటిలో నిద్రపోవడం వల్ల శరీరంలో ఎక్కువ మెలటోనిన్ ఉత్పత్తి అవుతుంది, ఇది వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాబట్టి, రాత్రి గదిలో ఎప్పుడూ చీకటిలో పడుకోండి. అలాగే, పడుకునే ముందు మొబైల్ లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లకు దూరంగా ఉండటం మంచిది.

మీరు కూడా బరువు తగ్గాలనుకుంటున్నారా..? రాత్రి పడుకునే ముందు ఈ చిట్కాలు పాటించండి.. స్లిమ్‌ అవుతారు..!
Weight loss home remedies
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 06, 2023 | 12:48 PM

ఈ రోజుల్లో ఊబకాయం సాధారణ సమస్యగా మారింది. ప్రతి ఇద్దరిలో ఒక వ్యక్తి పెరుగుతున్న బరువుతో బాధపడుతున్నాడు. తప్పుడు ఆహారం, అనారోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామం లేకపోవడం వల్ల ఊబకాయం చాలా వేగంగా పెరుగుతోంది. స్థూలకాయం అసహ్యకరమైనది మాత్రమే కాదు, అనేక తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. ఊబకాయం మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. పెరుగుతున్న బరువును నియంత్రించడానికి, ప్రజలు ఆహారంలో మార్పు చేస్తుంటారు. జిమ్‌లో గంటల తరబడి చెమటొడుస్తుంటారు. అయితే ఎంత ప్రయత్నించినా బరువు తగ్గరు. అటువంటి పరిస్థితిలో మీ ఆహారం జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం ద్వారా, మీరు సులభంగా బరువు తగ్గవచ్చు. మీరు కూడా ఊబకాయంతో బాధపడుతూ, బరువు తగ్గాలనుకునేవారైతే రాత్రి పడుకునే ముందు కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. బరువు తగ్గడానికి రాత్రి పడుకునే ముందు ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

మీరు బరువు తగ్గాలనుకుంటే రాత్రి 7 గంటలలోపు భోజనం పూర్తి చేసేయండి. రాత్రి 7 గంటల తర్వాత రాత్రి భోజనం చేయకండి. రాత్రి భోజనానికి, పడుకునే సమయానికి మధ్య దాదాపు 3 గంటల గ్యాప్ ఉండాలి. రాత్రిపూట ఆహారం తీసుకుంటే ఆహారం సరిగా జీర్ణం కాదు. ఇది మీ జీవక్రియను కూడా ప్రభావితం చేస్తుందిజ ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. కాబట్టి, మీరు బరువు తగ్గాలనుకుంటే సాయంత్రం త్వరగా తినండి.

తేలికపాటి భోజనం తీసుకోండి..

ఇవి కూడా చదవండి

రాత్రిపూట ఎల్లప్పుడూ తేలికపాటి భోజనం చేయండి. బరువు తగ్గడానికి, రాత్రి భోజనంలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. రాత్రిపూట మీరు పచ్చి కూరగాయలు, సూప్, సలాడ్, పప్పులు వంటివి తినవచ్చు. మీకు అర్థరాత్రి ఆకలిగా అనిపిస్తే మీరు కీర దోసకాయ లేదా ఆపిల్ తినవచ్చు. రాత్రుళ్లు నిద్రపోయేటప్పుడు మెలటోనిన్ అనే హార్మోన్ మన శరీరంలో బ్రౌన్ ఫ్యాట్‌ను సృష్టించి కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుందని పరిశోధనలో తేలింది. చీకటిలో నిద్రపోవడం వల్ల శరీరంలో ఎక్కువ మెలటోనిన్ ఉత్పత్తి అవుతుంది, ఇది వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాబట్టి, రాత్రి గదిలో ఎప్పుడూ చీకటిలో పడుకోండి. అలాగే, పడుకునే ముందు మొబైల్ లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఉపయోగించవద్దు.

పసుపు పాలు త్రాగండి..

పసుపు పాలు బరువు తగ్గడానికి, మంచి నిద్రకు సహాయపడుతుంది. నిజానికి, పసుపులో థర్మోజెనిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది కొవ్వును కాల్చడంలో సహాయపడుతుంది. అదనంగా, ఇది జీవక్రియను ప్రేరేపిస్తుంది. కాబట్టి, ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పసుపు పాలు తాగండి.

మంచి నిద్ర పొందండి..

స్థూలకాయం నేరుగా నిద్రకు సంబంధించినది. బరువు తగ్గడానికి కనీసం 7 గంటల పాటు మంచి, డీప్‌, ప్రశాంతంగా నిద్రపోవటం చాలా ముఖ్యం. మీకు తగినంత నిద్ర లేకపోతే, మీ జీవక్రియ మందగిస్తుంది. బరువు తగ్గడం కష్టతరం చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..