Mandi Tribe : ఇదెక్కడి దారుణం..! కూతురిని పెళ్లి చేసుకున్న తండ్రి..ఎక్కడంటే..?

ఒక స్త్రీ పెళ్లి చేసుకున్న తర్వాత చిన్న వయసులోనే భర్త చనిపోయి వితంతువుగా మారితే అక్కడ మరో వ్యక్తి ఆమెని వివాహం చేసుకుంటాడు. ఈ పెళ్లిలో అతను తన భార్యగా అన్ని హక్కులను ఆమెకి ఇస్తాడు. అంతేకాకుండా వివాహం చేసుకున్న అమ్మాయికి ముందుగానే కూతురు పుట్టి ఉంటే కనుక..ఆమె యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఈ వ్యక్తి మళ్ళీ పెళ్లి చేసుకునే ఆచారం కూడా అక్కడ ఉంది. అంటే ఈ తెగలో తండ్రి, కూతుర్ని పెళ్లి చేసుకునే ఆచారం చాలా ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తుందట.

Mandi Tribe : ఇదెక్కడి దారుణం..! కూతురిని పెళ్లి చేసుకున్న తండ్రి..ఎక్కడంటే..?
Controversial Practices
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 06, 2023 | 12:35 PM

వేల, లక్షల సంవత్సరాల క్రితం మనిషి ఒంటరిగా జీవించాడని మనందరికీ తెలుసు. ఆ తర్వాత తన అవసరాలకు తగ్గట్టుగా సమూహాలుగా జీవించడం మొదలుపెట్టాడు. ఈ అర్థవంతమైన వ్యవస్థను కుటుంబం అంటారు. కుటుంబంలో ప్రతి బంధానికి దాని సొంత ప్రాముఖ్యత ఉంటుంది. గౌరవం ఉంది. అలాగే, శతాబ్దాలుగా ప్రపంచంలో వివిధ రకాల సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. ఈ సంప్రదాయాలలో కొన్ని ఆచార వ్యవహారాలు కొందరి దృష్టిలో పాపాలు. అత్యాచారంతో సమానం.. అలాంటిదే బంగ్లాదేశ్‌లోని ఓ వింత ఆచారం. ఈ ఆచారం తెలిస్తే.. కూతురు అనే పదాన్ని గౌరవంగా చూసే వ్యక్తులున్న మన సమాజంలో అక్కడి ఆచారం అందరినీ ఆగ్రహానికి గురిచేస్తుంది. ఇటీవల అలాంటి సంప్రదాయం గురించిన వార్త ఒకటి వెలుగులోకి రావటంతో సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతోంది. బంగ్లాదేశ్‌లోని ఒక తెగలో మాత్రం వింత ఆచారం కొనసాగుతుంది. బంగ్లాదేశ్‌లోని మండి అనే ఈ తెగలో కూతురికి పెళ్లి చేసి మరో కుటుంబాన్ని స్థాపించే బాధ్యతను నెరవేర్చాల్సిన సమయంలో ఆ తండ్రి తన కుమార్తెకు భర్త అవుతాడు.

బంగ్లాదేశ్ మండి తెగలో కొన్ని శతాబ్దాలుగా ఇలాంటి విచిత్రమైన ఆచారం కొనసాగుతూ వస్తోంది. కూతురు యుక్త వయసుకు వచ్చిన వెంటనే తండ్రి ఆమెకు భర్త అవుతాడు. అంతేకాకుండా ఒక స్త్రీ పెళ్లి చేసుకున్న తర్వాత చిన్న వయసులోనే భర్త చనిపోయి వితంతువుగా మారితే అక్కడ మరో వ్యక్తి ఆమెని వివాహం చేసుకుంటాడు. ఈ పెళ్లిలో అతను తన భార్యగా అన్ని హక్కులను ఆమెకి ఇస్తాడు. అంతేకాకుండా వివాహం చేసుకున్న అమ్మాయికి ముందుగానే కూతురు పుట్టి ఉంటే కనుక..ఆమె యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఈ వ్యక్తి మళ్ళీ పెళ్లి చేసుకునే ఆచారం కూడా అక్కడ ఉంది. అంటే ఈ తెగలో తండ్రి, కూతుర్ని పెళ్లి చేసుకునే ఆచారం చాలా ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తుందట. దీని గురించిన వార్తలు బయటకు రావడంతో నెటిజన్లు మండిపడుతూ ఘాటుగా స్పందిస్తున్నారు.

ఇటీవల మండి కమ్యూనిటీకి చెందిన ఓరోలా అనే అమ్మాయి ఈ ఆశ్చర్యకరమైన నిజంపై తన ఆవేదనను పోస్ట్‌ చేసింది. తన తండ్రి చనిపోయిన తర్వాత తన తల్లి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందని చెప్పింది. మొదట్లో అతనిని తన తండ్రి అని పిలిచిన ఒరోలా, ఆమె పెద్దయ్యాక అతనితో బలవంతంగా వివాహం చేశారు. ఈ వింత వైవాహిక సంప్రదాయానికి సంబంధించిన దారుణాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేయడంతో వార్త వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..