Andhra Pradesh: తాగి వాహనం నడిపితే ఇదే శిక్ష..! 121మందికి కమ్యూనిటీ సర్వీస్.. అంటే ఏంటో తెలుసా..

Visakhapatnam: ఇటీవల కాలంలో మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. కొంతమంది ప్రాణాలకు కూడా కోల్పోయారు. మరికొంతమంది తాగి వాహనం నడిపి ఇతరులకు ప్రమాదకారంగా మారారు. పోలీసులు కేసులో నమోదు చేస్తున్నారు... కోర్టులు తీవ్రతను బట్టి జరిమానాలు, జైలు శిక్షల్ని విధిస్తూ ఆదేశాలు ఇస్తుంది. కొన్ని కేసుల్లో జరిమానాలు, పరిసరాలను శుభ్రం చేయడం.. రోడ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాహనదారులకు అవగాహన కల్పించే లా శిక్షలు కూడా వేస్తున్నారు.

Andhra Pradesh: తాగి వాహనం నడిపితే ఇదే శిక్ష..! 121మందికి కమ్యూనిటీ సర్వీస్.. అంటే ఏంటో తెలుసా..
Drunk And Drive
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Jyothi Gadda

Updated on: Dec 06, 2023 | 11:42 AM

విశాఖపట్నం, డిసెంబర్‌06: మీరు విశాఖ రోడ్లపై తాగి వాహనం నడిపేవారికి ఝలక్..! మద్యం మత్తులో వాహనం నడుపుతూ ఇతరులకు హాని కలిగించే వారు తస్మాత్‌ జాగ్రత్త..! పీకల దాకా తాగేసి తమను తాము నియంత్రించుకోలేని స్థితిలో వాహనాలను రోడ్లపై పరుగులు పెట్టించేవారు ఇకపై బీ అలర్ట్‌..! మీలోని కిక్కు వదిలే పనిష్మెంట్ కు సిద్ధం కావాల్సిందే. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడితే.. కమ్యూనిటీ సేవ చేయాల్సిందే..! తాజాగా డ్రంక్‌ డ్రైవ్‌లో పట్టుబడిన 121 మందికి విశాఖ భీమిలి కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఏంటా శిక్ష..? అదేలా ఉంటుందనే కదా మీ సందేహం..అయితే, పూర్తి స్టోరీలోకి వెళ్లాల్సిందే..

– విశాఖ జిల్లా భీమిలిలో ఉన్న కోకోనట్ పార్కులో కొంతమంది హడావిడిగా కనిపించారు. పరిసరాలు శుభ్రపరుస్తూ కనిపించారు. అది కూడా అంకితభావంతో. అలాగే సెయింట్ ఆన్స్ స్కూల్ లోను చెత్తను త్వర త్వరగా క్లీన్ చేసేస్తున్నారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిసరాలను కూడా..! ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 100 మందికి పైనే ఉన్నారు. అలా అని వాళ్ళు ఏదో సేవాభావంతో చేయడం లేదు. తప్ప తాగి వాహనం నడుపుతూ రోడ్లపైకి వచ్చి పట్టుబడిన వారికి.. కమ్యూనిటీ సర్వీస్ కింద భీమలి కోర్టు శిక్ష ఖరారు చేసింది. కోర్టు ఆదేశాలతో బుద్ధిగా తన పనిలో పడ్డారు ఆ డ్రంక్ అండ్ డ్రైవర్లు.

– విశాఖలో అడిషనల్ డిస్టిక్ మెజిస్ట్రేట్, సీపీ రవిశంకర్ అయ్యానార్ ఆదేశాలతో విస్తృతంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలో చాలా పాయింట్లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ కేసులు పెడుతున్నారు. పట్టుబడిన వారిని కోర్టులో హాజరు పరుస్తున్నారు. అయితే.. భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు 121 మందిపై కేసులు పెట్టారు. వారిని కోర్టులో హాజరు పరిచారు. దీంతో కోర్టు వారికి.. వెయ్యి రూపాయలు జరిమానాలతో పాటు కమ్యూనిటీ సర్వీస్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలతో .. వారందరినీ దీనిలోని కొన్ని ప్రాంతాల్లో పరిసరాలు శుభ్రం చేశారు.

ఇవి కూడా చదవండి

వాళ్లకు జైలు శిక్ష..223 మందికి 6.19 లక్షల జరిమానా

– అలాగే కంచరపాలం, గోపాలపట్నం, పెందుర్తి, న్యూ పోర్టు, మల్కాపురం, ఎమ్మార్ పేట, త్రీ టౌన్, ఆనందపురం ప్రాంతాల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి.. వారిని న్యాయస్థానంలో హాజరపరిచారు. దీంతో కేసు తీవ్రతను బట్టి.. న్యాయస్థానం జైలు శిక్షను ఖరారు చేసింది. నలుగురికి ఎనిమిది రోజులు, 9రోజులు, 10రోజులు, 11రోజుల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఓవరాల్ గా 253 మందికి గాను జరిమానాల కూడా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది కోర్టు. 6.19 లక్షల జరిమానాలు విధించింది.

ఇటీవల కాలంలో..

– విశాఖలో ఇటీవల కాలంలో మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. కొంతమంది ప్రాణాలకు కూడా కోల్పోయారు. మరికొంతమంది తాగి వాహనం నడిపి ఇతరులకు ప్రమాదకారంగా మారారు. పోలీసులు కేసులో నమోదు చేస్తున్నారు… కోర్టులు తీవ్రతను బట్టి జరిమానాలు, జైలు శిక్షల్ని విధిస్తూ ఆదేశాలు ఇస్తుంది. కొన్ని కేసుల్లో జరిమానాలు, పరిసరాలను శుభ్రం చేయడం.. రోడ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాహనదారులకు అవగాహన కల్పించే లా శిక్షలు కూడా వేస్తున్నారు.

– వాహనాలు డ్రైవ్ చేసినప్పుడు మద్యం మత్తుకి దూరంగా ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించి రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కలిసి రావాలని కోరుతున్నారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..