Giant Weta: ప్రపంచంలోనే అత్యంత బరువైన వింత కీటకం.. సోషల్ మీడియాలో వైరల్‌..

దీనిని కీటకాలలో హెవీవెయిట్ ఛాంపియన్ అంటారు. 71 గ్రాముల బరువున్న ఈ కీటకం భూమిపై అత్యంత బరువైన కీటకంగా గుర్తింపు పొందింది. అయితే, దీనిపై చాలా మందికి సందేహాలు ఉన్నాయి. ఈ కీటకాలు నిజంగానే బరువున్నాయా..? అవి ఏం తింటాయనే సందేహాలు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి. వీటికి ఇష్టమైన ఆహారం క్యారెట్. ఈ కీటకాలు క్యారెట్లను తినడానికి ఇష్టపడతాయి. అవి క్యారెట్ తింటున్న ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.

Giant Weta: ప్రపంచంలోనే అత్యంత బరువైన వింత కీటకం.. సోషల్ మీడియాలో వైరల్‌..
Giant Weta
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 06, 2023 | 9:51 AM

ప్రపంచంలోనే అతి పెద్ద జంతువు, పక్షి ఏది అని అడిగితే కొంత మంది తేలిగ్గా సమాధానం చెప్పగలరు. కానీ, ప్రపంచంలోనే అతి పెద్ద కీటకం ఏది అని ఎవరైనా ప్రశ్నిస్తే చాలా మంది సమాధానం చెప్పలేరు. అయితే తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద కీటకం గురించిన సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ కీటకం చాలా పెద్దది. ఇది మూడు భారీ ఎలుకల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఈ జెయింట్ క్రిమి గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ కీటకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ పెద్ద కీటకం పేరు వెటా. ప్రపంచవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది. దీనిని కీటకాలలో హెవీవెయిట్ ఛాంపియన్ అంటారు. 71 గ్రాముల బరువున్న ఈ కీటకం భూమిపై అత్యంత బరువైన కీటకంగా గుర్తింపు పొందింది. అయితే, దీనిపై చాలా మందికి సందేహాలు ఉన్నాయి. ఈ కీటకాలు నిజంగానే బరువున్నాయా..? అవి ఏం తింటాయనే సందేహాలు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి. వీటికి ఇష్టమైన ఆహారం క్యారెట్. ఈ కీటకాలు క్యారెట్లను తినడానికి ఇష్టపడతాయి. అవి క్యారెట్ తింటున్న ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

భారీ బరువు తినే క్యారెట్ ఫోటోను @gansnrosesgirl3 Xలో షేర్ చేసారు. ఆ తర్వాత అది బాగా వైరల్ అవుతోంది. ఫోటోను ఫోటోగ్రాఫర్ మార్క్ మోఫెట్ క్లిక్ చేసారు. ఫోటోను షేర్‌ చేస్తూ.. వినియోగదారు ఇలా రాశాడు.. జెయింట్ వెటా ప్రపంచంలోనే అత్యంత బరువైన కీటకం. 71 గ్రాముల బరువు, ఎలుక కంటే మూడు రెట్లు బరువుంటుందని చెప్పారు. అవి క్యారెట్లును తింటాయని వెల్లడించారు. దీనిని మార్క్ మోఫెట్ ఫోటో తీశారు.

ఈ కీటకం న్యూజిలాండ్‌కు చెందినదని సమాచారం.అంతేకాదు, ఈ జెయింట్ వేటా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఇది 17.5 సెంటీమీటర్లు లేదా 7 అంగుళాల పొడవు పెరుగుతుంది. ఈ భారీ పురుగు సాధారణ ఎలుక కంటే మూడు రెట్లు ఎక్కువ బరువు ఉంటుంది. ఒక కీటకం పిచ్చుక కంటే ఎక్కువ బరువు ఉంటుంది. వేటా అనే పేరు మావోరీ పదం నుండి వచ్చింది. ఇది శాకాహారి, తాజా ఆకులను తింటుంది. కొన్నిసార్లు అవి ఇతర చిన్న కీటకాలను కూడా తింటూ జీవిస్తాయి.. ఎలుకలు, పిల్లులు వంటి జంతువులు వాటిని వేటాడడం వల్ల వాటి సంఖ్య క్రమంగా తగ్గుతోంది.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!