Goa Tour: ఇయర్ ఎండ్‌కి గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.? తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీ..
ఇక ఇయర్ ఎండ్‌ని గోవాలో సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకునే వారు చాలా మంది ఉంటారు. గోవాలోని ప్రకృతి అందాలను వీక్షిస్తూ.. ఏడాదికి వీడ్కోలు చెప్పేందుకు వేలాదిగా దేశ నలుమూలల నుంచి గోవాకు చేరుకుంటారు. ఈ క్రమంలోనే తెలంగాన టూరిజం సైతం ఓస్పెషల్ ప్యాకేజీని అందిస్తోంది. నాలుగు రోజుల పాటు ఉండేఈ టూర్ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి.? ప్యాకేజీ ధర ఎంత.?
2023 ఏడాదిలో చివరి నెలలోకి ఎంట్రీ ఇచ్చేశాము. మరికొన్ని రోజుల్లో ఏడాది ముగియనుంది. ఇక ఇప్పటి నుంచే ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. నెల రోజుల ముందు నుంచే పలు సంస్థలు, హోటల్స్ ఆఫర్స్‌ను ప్రకటిస్తున్నాయి.
ఇక ఇయర్ ఎండ్‌ని గోవాలో సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకునే వారు చాలా మంది ఉంటారు. గోవాలోని ప్రకృతి అందాలను వీక్షిస్తూ.. ఏడాదికి వీడ్కోలు చెప్పేందుకు వేలాదిగా దేశ నలుమూలల నుంచి గోవాకు చేరుకుంటారు. ఈ క్రమంలోనే తెలంగాన టూరిజం సైతం ఓస్పెషల్ ప్యాకేజీని అందిస్తోంది. నాలుగు రోజుల పాటు ఉండేఈ టూర్ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి.? ప్యాకేజీ ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడ తెలుసుకుందాం..
హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్ ప్యాకేజీ ప్రతీరోజూ సోమవారం అందుబాటులో ఉంటుంది. ఇందులో భాగంగా తొలి రోజు ప్రయాణం మధ్యాహ్నం 2 గంటలకు బషీర్‌బాగ్ నుంచి బస్సు ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. రెండో రోజు ఉదయం 6 గంటలకు కాలన్‌గట్‌లోని హోటల్ బెవ్వన్ రిసార్ట్‌కు చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు నార్త్ గోవా సైట్ సీయింగ్ ఉంటుంది. ఇందులో మపుసా సిటీ, లార్డ్ బోడ్గేశ్వర్ టెంపుల్, ఫోర్ట్ అగుడా, బాగా బీచ్, కాలన్‌గట్ బీచ్, వెగాటర్ బీచ్‌లు కవర్ అవుతాయి.
ఇక మూడో రోజు సౌత్ గోవా విజిటింగ్ ఉంటుంది. ఇందులో భాగంగా డోనా పౌలా బీచ్, మిరామర్, ఓల్డ్ గోవా చర్చిలు, మంగౌషి టెంపుల్, కోల్వా బీచ్, మార్డోల్ బీచ్‌లు కవర్ అవుతాయి. సాయంత్రం బోట్ క్రూయిజ్ జర్నీ ఉంటుంది. ఇందుకోసం రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం హోటల్ బెవన్ రిసార్ట్‌లో బస ఉంటుంది. ఇక నాల్గవ రోజు ఉదయం 11 గంటలకు హోటల్ నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణం ఉంటుంది. 5వ రోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోవడంతో ప్రయాణం ముగుస్తుంది.
ఇక ప్యాకేజీ ధర విషయానికొస్తే పెద్దలకు రూ. 11,999, చిన్నారులకు రూ. 9599గా నిర్ణయించారు. సింగిల్ ఆక్యుపెన్సీ విషయానికొస్తే రూ. 14,900 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీలో రెండు నైట్ హాల్ట్స్‌తో పాటు.. ఏసీ వోల్వో కోచ్‌తో పాటు ఏసీ అకామిడేషన్‌ను కల్పిస్తారు. పూర్తి వివరాలతో పాటు బుకింగ్ కోసం 9848540371 ఫోన్ నెంబర్‌ను సంప్రదించడి. పూర్తి వివరాల కోసం క్లిక్ ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..