Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఏ దిశ గోడకు ఏ రంగు వేసుకోవాలో తెలుసా.? వాస్తు ఏం చెబుతోందంటే..

ఇలా వాస్తు శాస్త్రంలో తెలిపిన వివరాల ఆధారంగా రంగులు వేసుకుంటే ఇంట్లో మానసిక ప్రశాంతత లభిస్తుంది. రంగు మనిషి ఆలోచనపై ప్రభావం చూపుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా మనిషి మానసిక ఆరోగ్యంపై రంగుల ప్రభావం చూపుతుంది. అందుకే ఇంట్లో వేసుకునే రంగుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ వాస్తు శాస్త్రం ప్రకారం..

Vastu Tips: ఏ దిశ గోడకు ఏ రంగు వేసుకోవాలో తెలుసా.? వాస్తు ఏం చెబుతోందంటే..
Vastu Tips
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 06, 2023 | 11:40 AM

మనలో చాలా మంది వాస్తు నియమాలను పాటిస్తుంటారు. ఇంటి నిర్మాణం మొదలు, ఇంట్లో ఉండే వస్తువుల వరకు ప్రతీ విషయంలో వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుంటారు. అయితే చివరికి గోడలకు వేసే రంగుల విషయంలో కూడా వాస్తు నియమాలు ఉంటాయని మీకు తెలుసా.? అవును ఇంట్లో ఏ దిశకు ఏ రంగు వేయాలో వాస్తు శాస్త్రంలో వివరించారు.

ఇలా వాస్తు శాస్త్రంలో తెలిపిన వివరాల ఆధారంగా రంగులు వేసుకుంటే ఇంట్లో మానసిక ప్రశాంతత లభిస్తుంది. రంగు మనిషి ఆలోచనపై ప్రభావం చూపుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా మనిషి మానసిక ఆరోగ్యంపై రంగుల ప్రభావం చూపుతుంది. అందుకే ఇంట్లో వేసుకునే రంగుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ వాస్తు శాస్త్రం ప్రకారం.. ఏ దిశలో ఏ రంగు వేసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇంటికి ఆగ్నేయ దిశలో నారింజ, గులాబీ, పసుపు వంటి రంగులు వేసుకోవడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

* ఇక ఇంటికి ఉత్తర భాగంలో ఆకుపచ్చ, పిస్తా రంగులు వేయడం ద్వారా సంపద పెరుగుతుందని, లక్ష్మీ అనుగ్రహం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక స్కై బ్లూ కలర్‌ కూడా మంచిదే.

* దేవుడి గదిలో లేత పసుపు, తెలుగు, స్కై బ్లూ, నారింజ, గులాబీ వంటి రంగులు వేసుకోవడం వల్ల ఇంట్లో ప్రశాంతత లభిస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు.

* ఇక ఇంట్లో పడమర వైపు ఉండే గోడకు నీలం రంగు వేసుకుంటే మంచిదని వాస్తు పండితులు చెబుతున్నారు. అలాగే బెడ్‌ రూమ్‌లో గులాబీ రంగు, స్కై బ్లూ కలర్‌ వేసుకుంటే మంచిదని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఇక దక్షిణం వైపు ఆరంజ్‌ లేదా గులాబీ రంగు వేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.

ఇంట్లో వేసుకునే ఆరెంజ్‌, గులాబీ రంగులు శక్తిని సూచిస్తాయి. నీలిరంగు ప్రశాంతతకు సూచిక కాబట్టి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో పడకగది గోడలకు నీలిరంగు వేస్తే మనసు మహా ప్రశాంతంగా ఉంటుంది. దంపతుల మధ్య గొడవలు జరగకుండా ఉంటాయి. ఇక పసుపు రంగు మానసిక ఆనందాన్ని పెంచుతుంది. ఆకుపచ్చ రంగు హాలు, బెడ్‌రూమ్‌ గోడలకు ఎంచుకోవచ్చు.

నోట్: పైన తెలిపిన వియాలు వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించిన వివరాలు మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..