AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనుషులను కాకుండా యంత్రాలను సమాధి చేసే స్మశాన వాటిక.. పక్షులు మాత్రమే వెళ్లగల ప్రదేశం..! ఎక్కడో తెలుసా..?

ఈ ప్రాంతం సామాన్యులకు ఏ మాత్రం అందుబాటులో లేని నిర్జన ప్రదేశం. దీనికి సమీప భూభాగం కూడా 1,670 మైళ్లు లేదా 2,700 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశానికి చేరుకోవాలంటే.. సముద్రం దాటడానికే మీకు చాలా రోజులు పడుతుంది. ఈ ప్రాంతంలో చాలా చిన్న ద్వీపాలు ఉన్నాయని, ఇక్కడ పక్షులు తప్ప ఇతర జీవులు నివసించలేవని చెబుతారు. లైవ్ సైన్స్ ప్రకారం, చుట్టూ సముద్రపు నీటితో కూడి ఉన్న ఈ ప్రాంతం

మనుషులను కాకుండా యంత్రాలను సమాధి చేసే స్మశాన వాటిక.. పక్షులు మాత్రమే వెళ్లగల ప్రదేశం..! ఎక్కడో తెలుసా..?
Point Nemo
Jyothi Gadda
|

Updated on: Dec 06, 2023 | 7:52 AM

Share

లక్షలాది మందిని సమాధి చేసే భారీ స్మశానవాటిక గురించి మీరు వినే ఉంటారు. కానీ యంత్రాలకు కూడా స్మశానవాటిక ఉందని మీరు ఎప్పుడైనా విన్నారా..? అవును మీరు విన్నది నిజమే.. మనుషులకే కాదు.. పాడైపోయిన యంత్రాలను కూడా ఖననం చేసే ప్రత్యేక ప్రదేశం ఒకటి ఉంది. అది ఉపగ్రహాలను పాతిపెట్టే స్థలం. అంతరిక్షంలో తమ మిషన్‌ను పూర్తి చేసిన ఉపగ్రహాలు ఆ తర్వాత ఖననం చేయబడతాయి. ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)ని పాతిపెట్టే ప్రణాళికలు జరుగుతాయి. ఇది రాబోయే కొన్నేళ్లలో తన సేవ నుండి రిటైర్ కానుంది.

పాయింట్ నెమో ప్రాంతాన్ని ఎవరూ చేరుకోలేరు..

పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న పాయింట్ నెమోను ‘ఉపగ్రహాల స్మశానవాటిక’ అని పిలుస్తారు. ఈ ప్రాంతం సామాన్యులకు ఏ మాత్రం అందుబాటులో లేని నిర్జన ప్రదేశం. దీనికి సమీప భూభాగం కూడా 1,670 మైళ్లు లేదా 2,700 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశానికి చేరుకోవాలంటే.. సముద్రం దాటడానికే మీకు చాలా రోజులు పడుతుంది. ఈ ప్రాంతంలో చాలా చిన్న ద్వీపాలు ఉన్నాయని, ఇక్కడ పక్షులు తప్ప ఇతర జీవులు నివసించలేవని చెబుతారు. లైవ్ సైన్స్ ప్రకారం, చుట్టూ సముద్రపు నీటితో కూడి ఉన్న ఈ ప్రాంతం ఈస్టర్ ద్వీపానికి దక్షిణాన, అంటార్కిటికాకు ఉత్తరాన ఉంది. ఈ ప్రాంతం 13,000 అడుగులకు పైగా నీటిలో మునిగిపోయింది. మనుషులు చేరుకోలేని ఈ ప్రాంతాన్ని ‘పోల్ ఆఫ్ యాక్సెస్’ అని కూడా అంటారు.

ఇవి కూడా చదవండి

ఇప్పటివరకు ఎన్ని ఉపగ్రహాలు ఖననం చేయబడ్డాయి..?

నివేదికల ప్రకారం, 70 నుండి 300 కంటే ఎక్కువ ఉపగ్రహాలు, అంతరిక్ష కేంద్రాలు పాయింట్ నెమోలో ఖననం చేయబడ్డాయి. ఈ ఉపగ్రహాలు ప్రపంచంలోని వివిధ దేశాలకు అనుసంధానించబడి ఉన్నాయి. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా ఈ స్థలంలోనే ఐఎస్‌ఎస్‌ను పాతిపెడతామని ప్రకటించింది.

ISS ఎలా రిటైర్ అవుతుంది..?

ISS గత 25 సంవత్సరాలుగా అంతరిక్షంలో ఉంది. ఇది 2031 నాటికి అధికారికంగా పదవీ విరమణ చేయబడుతుంది. 357 అడుగుల పొడవు, 419,725 కిలోగ్రాముల బరువుతో, ఇది అంతరిక్ష కేంద్రం పాయింట్ నిమ్మోలో ఖననం చేయబడిన అతిపెద్ద అంతరిక్ష పరికరంగా నిలిచే అవకాశం ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..