Hit-And-Run: ట్రాఫిక్‌ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ను గుద్దుకుంటూ వెళ్లిన కారు.. వైరల్ గా మారిన వీడియో

గాయపడిన ట్రాఫిక్ పోలీసు పేరు అమిత్ కుమార్ అని తెలిసింది. ఇక్కడే ట్రాఫిక్‌ కంట్రోల్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే కాన్పూర్ నుంచి వస్తున్న కారు అతడిని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని భుజం విరిగిందని వైద్యులు తెలిపారు. ప్రమాదం అనంతరం ఒక్కసారిగా అక్కడ తీవ్ర ఉద్రికత్త చోటు చేసుకుంది.

Hit-And-Run: ట్రాఫిక్‌ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ను గుద్దుకుంటూ వెళ్లిన కారు.. వైరల్ గా మారిన వీడియో
Road Accident Lucknow
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 05, 2023 | 1:26 PM

సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు మనల్ని సంతోషపెడితే, కొన్ని వీడియోలు షాక్‌ అయ్యేలా చేస్తుంటాయి. మరికొన్ని వీడియోలు ఆలోచింపజేస్తాయి. మరికొన్ని వీడియోలు ఆందోళన, ఆగ్రహానికి గురిచేస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డ్రైవింగ్‌లో ప్రజలు ఎంత అజాగ్రత్తగా ఉంటారో తెలిపే వీడియో ఇది. ఇతరులు చేసే తప్పుల ఫలితంగా మరొకరు ఎలా బలవుతారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. కొంతమంది వ్యక్తులు కేవలం తమ గురించి మాత్రమే శ్రద్ధ వహిస్తారు. ఇతరుల జీవితాలను గురించి ఏ మాత్రం పట్టించుకోరు. దాంతో వారి ప్రాణాలను ప్రమాదంలో పడవేస్తుంటారు..డ్రైవింగ్‌లో అజాగ్రత్తగా ఉండటం సర్వసాధారణంగా మారింది. చాలా మంది మద్యం సేవించి వాహనాలు నడపడం ఇటీవలి కాలంలో మరీ ఎక్కువైంది.

లక్నోలో వేగంగా వెళ్తున్న ఓ కారు ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన కృష్ణానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కారు బలంగా ఢీకొనడంతో అతను వెంటనే రోడ్డుపై పడిపోయాడు. అయినప్పటికీ కారు డ్రైవర్ వేగంగా అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. పోలీసులు అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, అతడు అతి వేగంతో వెళ్లాడు. ఈ ఘటనలో ఓ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

ఘటనతో గాయపడిన ట్రాఫిక్ పోలీసు పేరు అమిత్ కుమార్ అని తెలిసింది. ఇక్కడే ట్రాఫిక్‌ కంట్రోల్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే కాన్పూర్ నుంచి వస్తున్న కారు అతడిని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని భుజం విరిగిందని వైద్యులు తెలిపారు. ప్రమాదం అనంతరం ఒక్కసారిగా అక్కడ తీవ్ర ఉద్రికత్త చోటు చేసుకుంది.

సీసీటీవీ ఫుటేజీ సాయంతో ఢీకొన్న కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫుటేజీ ఆధారంగా పోలీసులు అతడిని గుర్తించారు. అతని పేరు అభిషేక్ దాస్. అతని వయస్సు 31 సంవత్సరాలు. అతను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చట్టపరమైన చర్యలకు పూనుకున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..