Anger Management: కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి..? ఈ 8 చిట్కాలతో కంట్రోల్‌ చేసుకోండి.!

క్షమాపణ అనేది ఒక శక్తివంతమైన సాధనం. మీరు కోపం, ఇతర ప్రతికూల భావావేశాలను పెంపొందించుకోవడం వదిలేయండి..మోసపోయామని, అన్యాయం జరిగిందనే భావనతో మిమ్మల్ని మీరు బాధపెట్టుకోవటం వదిలేయండి. మీ కోపానికి, ఆవేదనకు కారణమైన వ్యక్తిని క్షమించడం మీ ఇద్దరికీ ఆ పరిస్థితుల నుండి గుణపాఠం నేర్చుకునేందుకు, మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

Anger Management: కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి..? ఈ 8 చిట్కాలతో కంట్రోల్‌ చేసుకోండి.!
Anger ManagementImage Credit source: Pixabay
Follow us
Jyothi Gadda

| Edited By: TV9 Telugu

Updated on: May 14, 2024 | 12:28 PM

ప్రతి మనిషిలో అనేక రకాల భావోద్వేగాలు ఉంటాయి. అందులో కోపం కూడా ఒకటి. మనిషికి రోజూ రకరకాల కారణాల వల్ల కోపం రావడం సహజం. ముఖ్యంగా అనేక పని పనుల ఒత్తిడి కారణంగానే మనిషిలో కోపానికి దారితీస్తుంది. అయితే, కోపానికి కారణం మన శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే.. ప్రతి చిన్న అంశానికి కూడా కోపం వస్తూ ఉంటుంది. కానీ ప్రతిసారీ కోపం తెచ్చుకోవడం మనల్ని మరింత ప్రమాదలో పడవేస్తుంది. మితిమీరిన కోపం అనేక అనర్థాలకు దారితీస్తుంది. మరి కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి..? మన కోపాన్ని తగ్గించుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి..

1. మీరు మాట్లాడే ముందు ఆలోచించండి..

క్షణంలో కోపం తెచ్చుకోవడం సులభం. కానీ, మీరు ఆ తర్వాత పశ్చాత్తాపపడతారు. కోపంలో ఏదైనా మాట్లాడే ముందు ఒక్క సెకను ఆలోచించటం మంచిది. ఆలోచించి మాట్లాడటం వల్ల అవతలి వ్యక్తుల్ని గాయపరిచే మాటలు మాట్లాడకుండా ఉంటారు.

ఇవి కూడా చదవండి

2. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ ఆందోళన బయటపెట్టండి..

మీరు ప్రశాంతంగా ఉన్న సమయంలో మీ నిరాశ, ఆందోళనను అవతలి వారికి వ్యక్తం చేయండి. ఇతరులను బాధపెట్టకుండా, వారిని మీ అణచివేయాలని ప్రయత్నించకుండా మీ ఆందోళనలు, అవసరాలను స్పష్టంగా, నేరుగా తెలియజేయండి.

3. కొంత వ్యాయామం చేయండి..

శారీరక శ్రమ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మీ కోపం పెరుగుతున్నట్లు మీకు అనిపిస్తే, వేగంగా నడవండి లేదా పరుగెత్తండి. లేదా ఇతర ఆనందదాయకమైన శారీరక కార్యకలాపాలు చేస్తూ కాసేపు టైమ్‌ పాస్‌ చేసేయండి..

4. విశ్రాంతి తీసుకోండి..

మీ సమయం కేవలం ఇళ్లు పిల్లలు మాత్రమే కాదు. ఒత్తిడితో ఉన్న సమయలో మీ కోసం చిన్న విరామం తీసుకోండి. కొన్ని క్షణాల పాటు నిశ్శబ్దంగా ఉండటం కూడా చిరాకు, కోపం రాకుండా ఉండేలా చూసుకోండి.

5. మీ చేతిలో లేనిది, మీరు మార్చలేనిది..

మీ పిల్లల గజిబిజి గది మిమ్మల్ని కలవరపెడుతుందా? అయితే, ఆ రూమ్‌ తలుపు మూయండి. మీ భాగస్వామి ప్రతి రాత్రి భోజనానికి ఆలస్యంగా వస్తున్నారా? సాయంత్రం తర్వాత డిన్నర్‌ని షెడ్యూల్ చేయండి. లేదా వారానికి కొన్ని సార్లు ఒంటరిగా తినడం అలవాటు చేసుకోండి. అలాగే, కొన్ని విషయాలు మీ నియంత్రణలో లేవని అర్థం చేసుకోండి. మీరు మార్చగలిగే, మార్చలేని వాటి గురించి వాస్తవికంగా ఉండటానికి ప్రయత్నించండి. కోపం దేనినీ పరిష్కరించదని, పరిస్థితిని మరింత దిగజారేలా చేస్తుందని గుర్తుంచుకోండి.

6. పగ పట్టుకోకండి..

క్షమాపణ అనేది ఒక శక్తివంతమైన సాధనం. మీరు కోపం, ఇతర ప్రతికూల భావావేశాలను పెంపొందించుకోవడం వదిలేయండి..మోసపోయామని, అన్యాయం జరిగిందనే భావనతో మిమ్మల్ని మీరు బాధపెట్టుకోవటం వదిలేయండి. మీ కోపానికి, ఆవేదనకు కారణమైన వ్యక్తిని క్షమించడం మీ ఇద్దరికీ ఆ పరిస్థితుల నుండి గుణపాఠం నేర్చుకునేందుకు, మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

7. టెన్షన్‌ను వదిలేయడానికి జోక్స్‌ వినండి..

కొన్ని జోక్స్‌ మీలో ఒత్తిడిని వ్యాప్తి చేయడంలో సహాయపడుతుంది. మీకు కోపం తెప్పించే విషయాలు ఎదురైనప్పుడు మీరు హస్యాస్పదంగా ఉండేలా చూసుకోండి. అంతేగానీ, వ్యంగ్యంగా మాట్లాడటం మానేయండి. అది అవతలి వారి భావాలను దెబ్బతీస్తుంది. మీ మధ్య మరింత ఆగ్రహాన్ని పెంచుతుంది.

8. రిలాక్సేషన్ స్కిల్స్‌ను ప్రాక్టీస్ చేయండి..

మీలో కోపం పెరిగినప్పుడు, రిలాక్సేషన్ స్కిల్స్‌కు పని చెప్పండి. దీర్ఘ శ్వాస వ్యాయామాలను ప్రాక్టీస్ చేయండి. కావాలంటే మ్యూజిక్‌ వినండి. మీకు తెలిసిన మ్యూజిక్‌ ప్లేయర్‌ని ప్రాక్టీ్‌స్‌ చేయండి..లేదంటే యోగా కూడా చేయవచ్చు. ఇలాంంటి చిట్కాలను పాటించటం ద్వారా మీరు మీ కోపాన్ని కంట్రోల్‌ చేసుకోగలరు.

మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..